Begin typing your search above and press return to search.
అది నరబలి.. నారాబలి...సజ్జల కామెంట్శ్
By: Tupaki Desk | 29 Dec 2022 1:36 PM GMTకందుకూరి విషాదం మీద వైసీపీ నేతలు తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కందుకూరులో జరిగింది నరబలి ని విమర్శించారు. పుష్కరాల టైం లో 29 మందిని పొట్టన పెట్టుకున్న బాబు ఇపుడు విపక్ష నేతగా ఎనిమిది మందిని బలి తీసుకున్నారని మండిపడ్డారు.
తన ఇరుకు రాజకీయం కోసం కార్యకర్తలను బలి చేసినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదని, పైగా ప్రభుత్వం మీద కోపంతో ఆవేశంతో తాము చేస్తున్న ఉద్యమానికి జనాలు వచ్చి చనిపోయారని కలరింగ్ ఇవ్వడం బాబుకే చెల్లిందని విమర్శించారు. బాబు మీటింగుకు వచ్చింది చనిపోవడానికా అని ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబు అహంకారంతో నాడు పుష్కరాల మృతుల మీద నీచ కామెంట్స్ చేశారని, ఎక్కడ ప్రమాదాలు జరగడంలేదని సీఎం స్థాయిలో ఆయన మాట్లాడారని, ఇపుడు కూడా అలాగే వ్యవహరిస్తున్నారు అని ఆయన అన్నారు. జరిగిన విషాదం నుంచి బాబు ఏ మాత్రం నేర్చుకోవడంలేదని అర్థమవుతుంది అన్నారు.
పోలీసుల మీద నిందలు వేస్తున్న చంద్రబాబు వారి మాటలు సూచనలు విన్నారా పట్టించుకున్నారా అని ఆయన నిలదీశారు. ఎన్టీయార్ స్టాట్యూ ఒక చోట ఉంటే యాభై మీటర్ల దూరంలో మీటింగ్ పెట్టారని, అక్కడికి తన వాహనంలో జనాన్ని తోసుకుని రావడంతో తొక్కిసలాటలోనే నరబలి జరిగిందని ఆయన విమర్శించారు. ఇది ఒక ప్లాన్ ప్రకారం జరిగిందా అని అనుమానించినా ఆశ్చర్యపోవనవసరం లేదని ఆయన అన్నారు.
ఏదో ఒక సంచలనం సృష్టించాలి, దాన్ని రాజకీయంగా లాభంగా వాడుకోవాలి. అదే విధంగా ప్రభుత్వం మీద విమర్శలు చేయాలి అన్నదే బాబు మార్క్ పాలిటిక్స్ అని అన్నారు. బాబుకు రూల్స్ లేవు, తాను ఏది అనుకుంటే అది జరగాలన్న పంతంతో చేసి కందుకూరులో ఇరుకు వీధుల్లో మీటింగ్ పెట్టారు అన్నారు. వంద అడుగుల రోడ్డుని కాస్తా హోర్డింగ్స్ ఫ్లెక్సీలు పెట్టి సగానికి సగం చేసి పారేశారని, డ్రోన్ కెమెరాల ద్వారా లేని జనం వచ్చినట్లుగా చిత్రీకరించి తన అనుకూల మీడియాలో వేయించుకుని జనాలను మభ్యపెట్టాలని బాబు చూస్తున్నారని ఆయన విమర్శించారు.
బాబు చేస్తున్న ఈ పనులను సభ్య సమాజం అంతా చూసి చీత్కరిస్తోందని సజ్జల కామెంట్స్ చేశారు. కందుకూరి ఘటన తరువాత కూడా బాబు ప్రవర్తన ఏమీ మారలేదని ఆయన దుయ్యబెట్టారు. ఉన్న రోడ్డుని తగ్గించి ఇరుకున చేయడం ద్వారా తొక్కిసలాట జరుగుతుందా లేదా అని ఆయన ప్రశ్నించారు. ఈ కామన్ సెన్స్ పాయింట్ కూడా తెలుగుదేశనికి లేదా అని ఆయన ప్రశ్నించారు. బాబు చేసినది నేరపూరితమైన చర్య అని ఆయన కామెంట్స్ చేశారు.
ఈ విషయం తేలిగ్గా తీసుకోకూడదని, ఈ విషాదం మీద చంద్రబాబు కానీ ఆ పార్టీ నేతలకు కానీ మాట్లాడేందుకు అర్హత లేదని, వారు నోరెత్తి మాట్లాడేందుకు సిగ్గు ఉండాలని సజ్జల ఫైర్ అయ్యారు. చంద్రబాబు నేరాల వల్లనే నరబలి జరిగిందని ఎనిమిది మంది అకాల మరణాలకు బాబే వ్యక్తిగతంగా బాధ్యుడని, ఆయన పార్టీ కూడా బాధ్యత వహించాలని, చట్టపరంగా కూడా న్యాయపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సజ్జల స్పష్టం చేశారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే ఇలాంటి వాటిని కూడా నేరాలుగా పరిగణించాలని సజ్జల కోరారు. ఏ పార్టీ అయినా వచ్చిన జనాలకు సౌకర్యవంతంగా ఉండేలా సభలు జరుపుకోవాలని ఆయన అన్నారు. కానీ టైట్ మీటింగ్స్ అన్నట్లుగా చూపించడం డ్రోన్ కెమరా షాట్స్ కోసం యత్నించడం వంటివి తప్పు అని ఆయన అన్నారు. కందుకూరి విషాదం తరువాత ప్రభుత్వం కూడా ఇలాంటి విషయాల మీద సీరియస్ గా ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. కందుకూరి ఘటన విషయంలో సమగ్రమైన దర్యాప్తు జరగాలని ఆయన అన్నారు. ఈ విషయం కూడా పరిశీలిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.