Begin typing your search above and press return to search.
కొత్త జీతాలే ఇస్తాం.. చర్చలకు వచ్చి ఉంటే వేరేగా ఉండేది: సజ్జల కామెంట్స్
By: Tupaki Desk | 28 Jan 2022 2:30 PM GMTఏపీలో ఉద్యోగులు.. ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పీఆర్సీ వివాదం మరింత ముదురుతుందా? ప్రభుత్వం వేసిన సంప్రదిం పుల కమిటీ ముందుకు వచ్చేందుకు ఉద్యోగులు ససేమిరా అనడంతో .. సర్కారు మరింత పట్టుబిగించేందుకు సిద్ధంగా ఉందనే సంకేతాలు పంపుతోందా? అంటే.. తాజాగా జరిగిన పరిణామాలను బట్టి ఔననే అంటున్నారు పరిశీలకులు. ఉద్యోగుల విషయంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా స్పందించారు. అయితే.. ఆయన వ్యాఖ్యల్లో కొంత `కటువు` తనం కనిపించిందంఇ. కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు జనవరి నెల వేతనాలు చెల్లిస్తామన్నారు.
ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలకు , ఉద్యోగ సంఘ నాయకులు పెట్టిన మూడు డిమాండ్లకు సంబంధం లేదని ఆయన తెలిపారు. ముఖ్యమైన హెచ్ఆర్ఏ సవరణ అంశాన్ని ఉద్యోగ సంఘాలు ప్రస్తావించటం లేదన్నారు. ఉద్యోగులు ఈ నెలకు పాత జీతాలే ఇవ్వాలని కోరుతున్న అంశంపై మాట్లాడుతూ.. ``ఉద్యోగ సంఘాలు మంత్రుల కమిటీతో చర్చలకు వస్తే పాత జీతాలు వేసే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించి ఉండేది. కానీ, వారు రాలేదు. తద్వారా ఉద్యోగులు చర్చలకు రాకపోవడం వల్ల ఈ నెలవరకూ పాత జీతాలు తీసుకునే అవకాశం కూడా కోల్పోయారు`` అనేలా సజ్జల వ్యాఖ్యలు చేశారు.
కొత్త పేస్కేళ్లతో వేతన బిల్లులను రూపోందిస్తున్న డీడీఓలను పనిచేసుకోనివ్వకుండా ఉద్యోగులు అడ్డుకుంటున్నారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఆర్ఏ శ్లాబులపై నష్టం జరుగుతుందని ఉద్యోగ సంఘాలు భావిస్తే దానిపై చర్చించడానికి మంత్రుల కమిటీ సిద్ధమేనని ఆయన మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఉద్యోగ సంఘాల కంటే ఎక్కువే ఉద్యోగుల బాగోగుల గురించి ప్రభుత్వం ఆలోచించిందని ఆయన తెలిపారు. పదే పదే చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలను కోరి, పిలిచి మాట్లాడామని సజ్జల గుర్తుచేశారు.
ఆర్ధిక సమస్యల కారణంగా ఒకటీ రెండు అంశాలపైనే దృష్టి పెట్టాలని ఉద్యోగ సంఘాలకు ముందే చెప్పామన్నారు. ప్రాధాన్యత దృష్ట్యా ఫిట్మెంట్ పై నిర్ణయమే కీలకమని ఉద్యోగ సంఘాలు చెప్పాయని సజ్జల తెలిపారు. ఇప్పుడు మాటమార్చి మరోలా వ్యవహరించటం సరికాదన్నారు. తద్వారా ఫిట్ మెంట్ పై గతంలో అంగీకరించి ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని ఉద్యోగసంఘాల నేతల్ని ఉద్దేశించి సజ్జల వ్యాఖ్యానించారు.
ఇవాళ కూడా ఉద్యోగులతో చర్చల కోసం వచ్చామని సజ్జల తెలిపారు. కొన్ని సంఘాలు చర్చలకు వచ్చాయని చెప్పారు. ఘర్షణకు దారితీయకూడదని కమిటీ ఏర్పాటు చేశారని వెల్లడించారు. కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు జనవరి వేతనాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగుల ఆందోళన, సంఘాల నేతల మూడు డిమాండ్లకు సంబంధం లేదన్నారు. హెచ్ఆర్ఏ సవరణ అంశాన్ని సంఘాల నేతలు ప్రస్తావించడం లేదని వివరించారు. చర్చలకు వస్తే పాత జీతాలు వేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించేదన్నారు.
హెచ్ఆర్ఏ శ్లాబులపై నష్టం జరిగిందని భావిస్తే చర్చలకు సిద్ధమని వెల్లడించారు. ఫిట్‌మెంట్‌పై నిర్ణయమే కీలకమని ఉద్యోగ సంఘాలు చెప్పాయన్నారు. ఇప్పుడు మాట మార్చి మరోలా వ్యవహరిస్తున్నాయన్నారు. సో.. ఈ మొత్తం ఎపిసోడ్‌ను పరిశీలిస్తే.. ప్రభుత్వం ఇక.. తన పట్టును నిరూపించుకునే అవకాశం దిశగా అడుగులు వేస్తున్నట్టు స్పష్టమవుతోందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.