Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌కు సెగ పెడుతున్న `స‌జ్జ‌ల` వ్య‌వ‌హారం.. కిం క‌ర్త‌వ్యం?

By:  Tupaki Desk   |   15 Sep 2021 9:09 AM GMT
జ‌గ‌న్‌కు సెగ పెడుతున్న `స‌జ్జ‌ల` వ్య‌వ‌హారం.. కిం క‌ర్త‌వ్యం?
X
ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు ఇప్పుడు అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయి. రాష్ట్ర ఆర్ధిక ప‌రిస్థితి నుంచి ప్ర‌తిప‌క్షాల పోరు వ‌ర‌కు.. వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల నుంచి పార్టీ వ్య‌వ‌హారాల వ‌రకు ఆయ‌నకు లేని త‌ల‌నొప్పి అంటూ .. ఏదీ లేదు. అనేక స‌మస్య‌లు జ‌గ‌న్‌ను వెంటాడుతున్నాయి. అయితే.. దీనికి క‌లిసి వ‌చ్చిందా? అన్న‌ట్టుగా.. ఇప్పుడు త‌న రాజ‌కీయ వ్య‌వ‌హారాల స‌ల‌హాదారు.. పార్టీ కీల‌క నాయ‌కుడు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.. స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి వ్య‌వ‌హారం మ‌రో త‌ల‌నొప్పిగా మారింది. రాజ‌కీయ నాయ‌కుడుగా ఉన్న స‌జ్జ‌ల ను.. ప్ర‌బుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. స‌ల‌హాదారుగా నియ‌మించారు.

అయితే.. ఆయ‌న మాత్రం ఇత‌ర స‌ల‌హా దారుల్లా కాకుండా.. స‌ర్వం తానే అయి.. క‌థ న‌డిపిస్తున్నార‌నే వాద‌న ఇటీవ‌ల కాలంలో పార్టీలో వినిపిస్తోంది. పార్టీ స‌మ‌స్య‌లు, నేత‌ల వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు.. ప్ర‌భుత్వానికి సంబంధించి ప్ర‌తిప‌క్షాలు చేసే విమ‌ర్శ‌లు.. ఇలా.. అనేక స‌మ‌స్య‌ల‌పై స‌జ్జ‌ల త‌న‌దైన శైలిలో వ్య‌వ‌హ‌రిస్తు న్నారు. త‌ర‌చుగా మీడియా స‌మావేశాలు కూడా నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌భుత్వ వాద‌న‌ను వినిపిస్తున్నారు. ప్ర‌తిప‌క్ష నేత‌ల వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తున్నారు. సైలెంట్ వ్యాఖ్య‌లే చేస్తున్నా.. సీమ ట‌పాకాయ‌ల్లా కామెంట్ల‌ను పేలుస్తున్నారు.

దీంతో ఇటీవ‌ల వైసీపీ రెబ‌ల్ ఎంపీ.. ర‌ఘురామ కృష్ణ‌రాజు.. స‌జ్జ‌ల‌పై హైకోర్టులో పిటిష‌న్ వేశారు. అస‌లు.. ఈయ‌న ప్ర‌భుత్వ స‌ల‌హాదారు క‌నుక‌.. ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే ప‌న్నుల ఆదాయం నుంచి జీతం తీసుకుంటు న్నాడు క‌నుక‌.. ఆయ‌న‌ను రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేయ‌కుండా నిలువ‌రించాల‌ని.. ఉద్యోగుల‌కు ఎలాంటి రూల్స్ వ‌ర్తిస్తాయో.. అవే రూల్స్‌ను స‌ల‌హాదారు విష‌యంలోనూ అమ‌లు చేయాల‌ని.. ర‌ఘురామ అభ్య‌ర్థిం చారు. దీంతో ఈ విష‌యం ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారి తీసింది. దీంతో రేపో మాపో.. ఈ విష‌యంపై హైకోర్టు నుంచి ప్ర‌భుత్వానికి విమ‌ర్శ‌లు ఎదుర‌య్యే ఛాన్స్ ఉంది.

దీంతో ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకునే దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టు వైసీపీ నేత‌లు గుస‌గుస‌లా డుతున్నారు. స‌జ్జ‌ల ప్ర‌స్తుతం స‌ల‌హాదారుగా ఉన్న నేప‌థ్యంలో ఆయ‌నకు కొన్ని ప‌రిమితులు ఉంటాయి. కానీ, రేపు ప్ర‌భుత్వంలోనే ఆయ‌న కీల‌క భూమిక పోషించే స్థాయిలో ఉంటే.. ఎలాంటివిమ‌ర్శ‌ల‌కు అవ‌కా శం ఉండ‌ద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం ప్ర‌జాప్ర‌తినిధి కాని.. ఆయ‌న‌ను ఎమ్మెల్సీని చేయ డం ద్వారా.. వెంట‌నే మంత్రి వ‌ర్గంలోకి (అంటే.. మ‌రో మూడు నాలుగు మాసాల్లో జ‌రిగే విస్త‌ర‌ణ‌) తీసుకునే అవ‌కాశం ఉంద‌ని.. ఈ దిశ‌గా సీఎం జ‌గ‌న్ ఆలోచ‌న చేస్తున్నార‌ని అంటున్నారు.

ఇదే జ‌రిగితే.. స‌జ్జ‌ల ఎవ‌రిపై ఎలాంటి కామెంట్లు చేసినా.. న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు రాక‌పోగా.. పార్టీలోనూ స‌జ్జ‌ల‌కు మరింత గ్రాఫ్ పెరుగుతుంద‌ని.. ఇది పార్టీకి, ప్ర‌బుత్వానికి కూడా మేలు చేస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే.. దీనిపై ఎవ‌రూ అధికారికంగా.. స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.