Begin typing your search above and press return to search.
గమనించారా... సజ్జల సౌండ్ లేదు...?
By: Tupaki Desk | 28 March 2022 1:30 AM GMTవైసీపీలో ఆయనను సకల శాఖల మంత్రిగా ఆఫ్ ది రికార్డ్ గా చెబుతారు. విపక్షాలు, ప్రత్యర్ధులు అయితే ఆయనే అన్ని శాఖలలూ చూస్తారని వెటకారం ఆడతారు. ఆయన ఎవరో కాదు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి. జగన్ మనసులో ఏముందో అది సజ్జల నోట్లో నుంచి వస్తుంది అని కూడా అంటారు. ఒక విధంగా ముఖ్యమంత్రికి ఆయన అధికార ప్రతినిధిగా చెప్పుకుంటారు.
అలాంటి సజ్జల సౌండ్ కొంతకాలంగా వినిపించడంలేదు. ఏపీలో ఈ మధ్య కాలంలో ఎన్నో సంఘటనలు జరిగాయి. కానీ సజ్జల మీడియా తరఫున అయితే పెద్దగా అలికిడి చేయడంలేదు. ఆయన ఈ నెల 12న పార్టీ ఆవిర్భావ కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొన్నారు. ఆ తరువాత ఆయన సందడి చేసింది ఎక్కడా చూడలేదని అంటున్నారు.
అసెంబ్లీ సెషన్ హోరులో సజ్జల ఊసుని అంతా మరచినా ఇపుడు గుర్తు చేసుకుంటూ ఆయన ఎక్కడ ఉన్నారబ్బా అని ఆరా తీస్తున్నారుట. అయితే సజ్జల ఏమీ ఖాళీగా లేరు. పైగా ఫుల్ బిజీగా ఉన్నారని అంటున్నారు. ఏపీలో వైసీపీ మంత్రివర్గ విస్తరణ తొందరలో ఉంది.
దాంతో ఈసారి మంత్రివర్గం ఎన్నికలతో కూడుకున్నది. అనేక సామాజిక వర్గ సమీకరణలు చూడాలి. ఎన్నో కూర్పులు మార్పులూ చేయాలి. దాంతో వైసీపీ హై కమాండ్ మంత్రి వర్గానికి సంబంధించి ఆశావహుల జాబితాను దగ్గర ఉంచుకుని షార్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసే కీలకమైన బాధ్యతలను సజ్జలకు అప్పగించింది అంటున్నారు.
దాంతో సజ్జల ఇపుడు కూడికలు తీసివేతలతో ఫుల్ బిజీ అంటున్నారు. ఇక మంత్రి పదవిని కోరుకున్న వారు ఆశావహులు అంతా కూడా సజ్జలనే కలుస్తున్నారు అని తెలుస్తోంది. మొత్తానికి మంత్రి వర్గ విస్తరణ కాదు కానీ సజ్జల తెర వెనక కసరత్తులో నిండా పనిలో ఉన్నారని అంటున్నారు.
అలా ఆయన అధినాయకత్వానికి ఎప్పటికపుడు అందుబాటులో ఉంటూ కొత్త మంత్రుల జాబితా తయారీలో సహాయం చేస్తున్నారు అంటున్నారు. మరి ఇదంతా బాగుంది కానీ రేపటి రోజున పదవులు రాని వారు సజ్జల మీద తమ బాణాలు ఎక్కుపెడతారేమో చూడాలి అంటున్నారు.