Begin typing your search above and press return to search.
వైసీపీ కార్యకర్తలకు బుద్ధి ఉందా? సజ్జల ఫైర్
By: Tupaki Desk | 11 April 2022 4:35 PM GMTవైసీపీ కార్యకర్తలపై కీలక సలహాదారు.. సజ్జల రామకృష్నారెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు బుద్ధి ఉందా? అంటూ.. ఫైరయ్యారు. తీవ్రస్తాయిలో అసహనం వ్యక్తం చేశారు. పక్కనే మీడియా ఉందన్న విషయాన్ని కూడా ఆయన మరిచిపోయి.. కార్యకర్తలపై విరుచుకుపడ్డారు. వాస్తవానికి ఎప్పుడూ.. కూల్‌గా ఉండే.. సజ్జల ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడం.. విస్మయానికి గురిచేసింది. మరి దీనికి కారణం ఏంటి.. అనేది చూస్తే..
కొత్త మంత్రుల జాబితాలో తన పేరు కొనసాగించకపోవడంతోమాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదివారం నుంచీ అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం కూడా సాగింది. దీంతో విజయవాడలోని బాలినేని నివాసానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఒకటికి రెండు సార్లు వచ్చారు. బాలినేనితో సమావేశమై.. బుజ్జగించే ప్రయత్నం చేశారు.
ఆదివారం సాయంత్రం కొత్త మంత్రుల పేర్లు బహిర్గతం అయినప్పటి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి బాలినేనితో మూడుసార్లు సమావేశమయ్యారు. నిన్న మధ్యాహ్నం ఒకసారి, రాత్రి శ్రీకాంత్‌రెడ్డితో కలిసి మరోసారి బాలినేనిని కలిసిన సజ్జల.. సోమవారం మంత్రి వర్గ ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే... మూడోసారి బాలినేనితో భేటీ అయ్యారు. అయినప్పటికీ మాజీ మంత్రి మెత్తబడలేదు.
ఈ క్రమంలోనే సీఎం జగన్ స్వయంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. బాలినేనిని తన వద్దకు తీసుకురావాల్సిందిగా సజ్జలను సీఎం ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డితో కలిసి బాలినేనిని సీఎం వద్దకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో బాలినేని ఇంటికి చేరుకున్న సజ్జలతో బాలినేని వర్గీయులు వాదనకు దిగారు. మా నాయకుడికి మంత్రి పదవి ఇవ్వకపోవాడానికి కారణం మీరే నంటూ.. విరుచుకుపడ్డారు.
దీంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన.. సజ్జల.. నీకు బుద్ధి ఉందా? అంటూ.. సదరు కార్యకర్తపై మండి పడ్డారు. ప్రస్తుతం.. ఈ వీడియో.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుండడం గమనార్హం. ఏదేమైనా.. ఎప్పుడూ.. ప్రశాంతంగా ఉండే.. సజ్జల ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఒకింత అసహనం వ్యక్తం చేయడం గమనార్హం.