Begin typing your search above and press return to search.
బాబూ.. పవన్ కు సీఎం పోస్టు ఇస్తావా? .. సజ్జల సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 9 May 2022 2:19 PM GMTఎన్నికలకు రెండేళ్ల ముందే ఏపీలో పొత్తులపై చర్చ మొదలైంది. ఈ అంశంపై ప్రతిపక్షాలు స్వరం పెంచుతుండటంతో అధికార వైసీపీలో గుబులు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పొత్తులపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. భావసారూప్యత కలిగిన పార్టీల మధ్య పొత్తులుంటాయన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని జంప్‌లు చేశారో అందరికీ తెలుసునని అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు వ్యూహం అంటూ లేదని సజ్జల విమర్శించారు. చంద్రబాబు, పవన్‌కు మధ్య కచ్చితంగా అవగాహన ఉందన్నారు. చంద్రబాబు సీఎం పదవి త్యాగం చేసి పవన్‌కు ఇస్తారా? అని ప్రశ్నించారు.
పవన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడంలేదన్నారు. బీజేపీతో పొత్తు ఉంటూనే.. పొత్తులపై ఇంకా నిర్ణయం తీసుకోలెదంటారని.. పవన్‌కు స్ర్కీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ చంద్రబాబేనని ఆరోపించారు. ఒంటరిగా పోటీ చేసి గెలిచే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. ప్రజా ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్రలు చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.
విపక్ష పార్టీలకు వారిలో వారికే స్పష్టత లేదని సజ్జల విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన సజ్జల.. 'ఒకరు త్యాగాలు అంటారు.. మరొకరు నేనే సీఎం అంటారు.. ఇంకొకరు మేం కలవమంటారు. చంద్రబాబు త్యాగం అంటే సీఎం పదవిని పవన్‌కు ఇస్తారా?, చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్ కల్యాణ్ నడుస్తున్నాడు. ప్రజలంటే లెక్కలేని తనమా, పగటి కలలు కంటున్నారు’ అని మండిపడ్డారు.
పెద్దిరెడ్డి కామెంట్ ఇదే!
ప‍్రతిపక్ష పార్టీల పొత్తులపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ''2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు రాజకీయల నుండి వైదొలగక తప్పదు. చంద్రబాబుకి ప్రజల్లో విశ్వసనీయత లేదు. ఒంటరిగా పోటీ చేస్తే గెలవడని చంద్రబాబుకి తెలుసు.. అందుకే పొత్తులకోసం పాకులాడుతున్నారు. చంద్రబాబుని అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోమని సూచిస్తున్నాను.`` అని వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల్లో అభిమానం ఉంది. అందుకే మేము ధైర్యంగా ఒంటరిగా పోటీ చేస్తున్నామని, ఒంటరిగానేఎన్నికలకు వెళ్తామని పెద్ది రెడ్డి చెప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తోడు దొంగలని అందరికీ తెలుసునని విమర్శించారు. బీజేపీతో పొత్తులో ఉండి టీడీపీతో మరో పొత్తుకు ప్రయత్నిస్తున్నాడని అన్నారు. పవన్ ఏ పార్టీతో పొత్తులో ఉన్నాడో ప్రజలకైనా స్పష్టత ఇవ్వాలని పెద్దిరెడ్డి సూచించారు.