Begin typing your search above and press return to search.
సజ్జల రామకృష్ణారెడ్డి పదవీ కాలం పొడిగింపు
By: Tupaki Desk | 13 Jun 2022 5:10 PM GMTవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తర్వాత నెంబర్ టూ ఎవరంటే అందరూ చెప్పే వ్యక్తి.. సజ్జల రామకృష్ణారెడ్డి. గతంలో ఉదయం దినపత్రికలో జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించిన సజ్జల ఆ తర్వాత సాక్షి దినపత్రిక, టీవీలకు ఎడిటోరియల్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. వైఎస్ జగన్ పార్టీ ప్రారంభించాక ఆయన రాజకీయ కార్యదర్శిగా వెళ్లారు.. సజ్జల.
జగన్ తరఫున అన్ని కార్యకలాపాలను చక్కదిద్దారు. ఆయనకు కుడి భుజంలా వ్యవహరించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రభుత్వ ప్రధాన సలహాదారు (ప్రజా వ్యవహారాలు) గా కేబినెట్ మంత్రి హోదాను కల్పించారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా సజ్జల వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా పార్టీ ఎమ్మెల్యేలందరికీ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. సజ్జలను కలిస్తే జగన్‌ను కలిసినట్టేననేది అంతా చెప్పే మాట.
అంతేకాకుండా ప్రభుత్వం తరఫున, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యర్థులపై, ఆయా పార్టీలపై నిప్పులు చెరిగేది కూడా సజ్జల రామకృష్ణారెడ్డినే కావడం గమనార్హం. వివిధ మంత్రిత్వ శాఖల తరఫున కూడా మీడియాకు సజ్జలే వివరణ ఇస్తుండటంపై వివాదాలు కూడా ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలు ఆయనను సకల శాఖ మంత్రి సజ్జల అని ఎద్దేవా చేస్తుంటాయి కూడా. ముఖ్యంగా ఏపీ హోం మంత్రిగా అంతకుముందు సుచరిత ఉన్నప్పుడు, ఇప్పుడు తానేటి వనిత ఉన్నా ఆ శాఖ వ్యవహారాలన్నీ సజ్జల ఆధ్వర్యంలోనే నడుస్తాయని విమర్శలున్నాయి.
అలాంటి సజ్జల రామకృష్ణారెడ్డి పదవీకాలం ప్రస్తుతం ముగియడంతో ఆయన పదవీ కాలాన్ని జగన్ ప్రభుత్వం ఏడాదిపాటు పొడిగించారు. అలాగే ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్)గా ఉన్న జీవీడీ కృష్ణమోహన్ పదవీకాలం కూడా ముగిసింది. దీంతో ఆయన పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా జీవీడీ కృష్ణమోహన్ కూడా గతంలో సాక్షి దినపత్రికలో ఎడిటోరియల్ బాధ్యతల్లో ఉన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయనను ప్రభుత్వ కమ్యూనికేషన్స్ సలహాదారుగా నియమించారు.