Begin typing your search above and press return to search.

స‌జ్జ‌ల‌కు చెప్పండ‌య్యా.. ఏది గొప్పో!!

By:  Tupaki Desk   |   7 Jan 2023 8:30 AM GMT
స‌జ్జ‌ల‌కు చెప్పండ‌య్యా.. ఏది గొప్పో!!
X
ఔను.. ఇప్పుడు ఈ కామెంట్ సోష‌ల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు, వైసీపీ కీల‌క నాయ‌కుడు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్య‌లు న్యాయ శాఖ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారితీసింది. న్యాయ‌శాఖ గొప్ప‌దా.. కార్య‌నిర్వాహ‌క శాఖ గొప్ప‌దా? అనేది స‌జ్జ‌ల వారి సందేహం. దీనికి కార‌ణం.. హైకోర్టు ప్ర‌భుత్వంపై చేస్తున్న వ్యాఖ్య‌లు.. వాటిని ప్ర‌చురిస్తున్న మీడియా!!

ఈ విష‌యంలో త‌న‌కు ఎలాంటి దాప‌రికం లేద‌న్న‌ట్టుగానే స‌జ్జ‌ల కామెంట్ చేశారు. ఏది గొప్ప‌? అనే ప్ర‌శ్న కు తెర‌దీశారు. రాజ్యాంగం ప్ర‌కారం రెండు స‌మాన‌మేన‌ని..ఆయ‌న అన్నారు. ఒక వ్య‌వ‌స్థ‌పై మ‌రో వ్య‌వ‌స్థ దాడి చేయ‌డం.. వ్యాఖ్య‌లు చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని వ్యాఖ్యానించారు. రాజ్యాంగం ప్ర‌కారం స‌మాన‌త్వం అంటే.. ఒక‌రిపై ఒక‌రు పైచేయి చేసుకోవ‌డం కాద‌న్నారు.

అయితే.. ఇన్ని చెప్పిన ఆయ‌న కార్య‌నిర్వాహ‌క వ్య‌వ‌స్థ ప‌నిచేయ‌క‌పోతే.. అంటూ ఏదో వ్యాఖ్యానించ‌బోయి ఆగిపోయారు. అంటే.. కార్య‌నిర్వాహ‌క వ్య‌వ‌స్థ ప‌నిచేయ‌క‌పోతే.. ఆదాయం ఉండ‌దు.. కోర్టుకు సొమ్ముల‌కు , జీతాలు కూడా రావు క‌దా! అనే ధోర‌ణిలో వ్యాఖ్యానించ‌బోయారు. అయితే.. ఎందుకో ఆయ‌న ఆగిపోయారు. ఇదిలావుంటే.. రాష్ట్ర ప్ర‌భుత్వ వైఖ‌రిని హైకోర్టు త‌ప్పుబ‌ట్ట‌డం.. తెలిసిందే.

ఈ క్ర‌మంలో కోర్టు చేస్తున్న వ్యాఖ్య‌ల‌కు ప్రాధాన్యం సంత‌రించుకుంది. అయితే.. వీటిపైనే ప్ర‌భుత్వ స‌ల‌హాదారు.. సీరియ‌స్ కావ‌డం.. గ‌మ‌నార్హం. వాస్త‌వానికి రాజ్యాంగం ప్ర‌కారం మూడు వ్య‌వ‌స్థ‌లకు స‌మాన హోదా, హ‌క్కులు క‌ట్ట‌బెట్టినా.. ఒక వ్య‌వ‌స్థ(అది ఏదైనా కావొచ్చు) దారి త‌ప్పుతున్న‌ట్టుగా భావిస్తే.. మ‌రో వ్య‌వ‌స్థ జోక్యం చేసుకుని స‌రిదిద్దే ప‌రిస్థితి కూడా రాజ్యాంగ‌మే క‌ల్పించింది.

అందుకే న్యాయ‌వ్య‌వ‌స్థ‌కు మ‌రిన్ని విస్తృత అధికారాల‌ను రాజ్యాంగం ద‌ఖ‌లు ప‌రిచింది. ధిక్క‌ర‌ణ అధికారం.. కూడా న్యాయ‌వ్య‌వ‌స్థ‌కు ఉందంటే.

దీన‌ర్ధ‌.. ప‌రమార్థం .. వేరేగా చెప్పాలా.. స‌జ్జ‌ల స‌ర్‌.. అంటున్నారు ప‌రిశీల‌కులు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.