Begin typing your search above and press return to search.

ఇక‌, స‌జ్జ‌ల స‌న్ రైజ్‌.. నేత‌ల‌కు ద‌బిడిదిబిడేనా?

By:  Tupaki Desk   |   5 Jan 2023 12:29 PM GMT
ఇక‌, స‌జ్జ‌ల స‌న్ రైజ్‌.. నేత‌ల‌కు ద‌బిడిదిబిడేనా?
X
ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీ అధికార పార్టీ వైసీపీని తెర‌వెనుక ఉండి న‌డిపిస్తున్నార‌నే వాద‌నను ఎదుర్కొంటున్న కీల‌క‌నాయ‌కుడు, స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అంటేనే.. పార్టీ నాయ‌కులు వ‌ణికి పోతున్నారు. ఆయ‌న త‌మ‌పై ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో.. ఏం చేస్తారో.. అని నాయ‌కులు త‌ల్ల‌డిల్లుతున్నారు. ఇక‌, ఇప్పుడు ఆయ‌న కుమారుడి వంతు వ‌చ్చింది. స‌జ్జ‌ల కుమారుడు భార్గ‌వ్ రెడ్డి కూడా ఇప్పుడు వైసీపీలో కీల‌కంగా మారారు.


తాజాగా వైసీపీలో పలు కీలక పదవులను భర్తీ చేస్తూ.. పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు.. భార్గవ్‌రెడ్డిని వైసీపీ సోషల్ మీడియా సహా మీడియా కో-ఆర్డినేటర్‌గా నియమించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయ ఇన్‌ఛార్జ్‌గా లేళ్ల అప్పిరెడ్డిని నియమించారు. ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగ అధ్యక్షుడుగా కొరివి చైతన్య నియమితులయ్యారు.

వైసీపీలో పలు కీలక పదవులు వ‌రించిన వారు..

యువజన విభాగం : బైరెడ్డి సిద్ధార్థరెడ్డి

మహిళా విభాగం : పోతుల సునీత(బీసీ)

బీసీ సెల్‌: జంగా కృష్ణమూర్తి(బీసీ)

ఎస్టీ సెల్‌ : మత్సరస వెంకటలక్ష్మీ(కొండ ప్రాంతం)

మేరాజోత్‌ హనుమంత్‌ నాయక్‌(మైదానం ప్రాంతం)

రైతు విభాగం : ఎంవీఎస్‌ నాగిరెడ్డి

విద్యార్థి విభాగం: పానుగంటి చైతన్య

చేనేత విభాగం : గంజి చిరంజీవి(బీసీ)

వైయస్ఆర్‌ టీయూసీ: పూనూరు గౌతమ్‌రెడ్డి

వికలాంగుల విభాగం: బందెల కిరణ్‌ రాజు

సాంస్కృతిక విభాగం: వంగపండు ఉష

ప్రచార విభాగం: ఆర్‌. ధనుంజయ్‌ రెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి

గ్రీవెన్స్‌ సెల్‌: అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి

న్యాయ విభాగం: ఎం. మనోహర్‌రెడ్డి

ఐటీ విభాగం: సునీల్‌ పోసింరెడ్డి

ఎన్ఆర్ఐ విభాగం: మేడపాటి వెంకట్‌

వైయస్ఆర్‌ టీఎఫ్‌: కల్పలతా రెడ్డి,

ఎస్సీ సెల్‌ : జూపూడి ప్రభాకర్,

మైనారిటీ సెల్‌: షేక్‌ వి. ఖాదర్‌బాషా

వైయస్ఆర్‌ సేవాదళ్‌: కోటంరెడ్డి గిరిధర్‌ రెడ్డి

డాక్టర్ల విభాగం: బత్తుల అశోక్‌ కుమార్‌ రెడ్డి

క్రిష్టియన్‌ మైనారిటీ సెల్‌: జాన్సన్‌ మేడిది

వాణిజ్య విభాగం: పల్లపోతు మురళీకృష్ణ, చిప్పగిరి ప్రసాద్‌


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.