Begin typing your search above and press return to search.
సజ్జన్నార్ సేఫ్? శంషాబాద్ డీసీపీకి షాకులు తప్పవా?
By: Tupaki Desk | 13 Oct 2021 3:34 AM GMTదేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ‘దిశ’ నిందితుల ఎన్ కౌంటర్ కు సంబంధించి ఏర్పాటైన జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ విచారణలో కీలకమైన నాటి సీపీ సజ్జన్నార్ పై ఆరోపణలు.. ఎన్ కౌంటర్ కు సంబంధించి ఆయన సేఫ్ అన్న మాట వినిపిస్తోంది. రెండురోజుల పాటు విచారణకు హాజరైన సందర్భంగా ఆయన ఏకంగా 160ప్రశ్నల్ని విచారణలో ఎదుర్కొంటున్నట్లుగా మీడియా రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. విచారణలో భాగంగా సజ్జన్నార్ కు ఎదురైన ప్రశ్నలు.. దానికి ఆయన ఇచ్చిన సమాధానాల్ని చూసినప్పుడు.. రానున్న రోజుల్లో ఆయన ఎలాంటి పరిణామాల్ని ఎదుర్కోనున్నారు? అన్నది ప్రశ్నగా మారింది.
ఈ నేపథ్యంలో పలువురు నిపుణులతో మాట్లాడిన సందర్భంగా.. వారి విశ్లేషణ ప్రకారం.. తాజాగా జరిగిన రీతిలో విచారణ కొనసాగిన పక్షంలో.. సజ్జన్నార్ సేఫ్ అని చెబుతున్నారు. మిగిలిన వారి మాదిరి ఎన్ కౌంటర్ మీద చెప్పిన సమాధానాలు కమిషన్ అసహనపడేలా ఉన్నప్పటికీ.. సాంకేతికంగా చూస్తే.. ఆయన్ను బుక్ చేసేలా మాత్రం లేవన్న మాట వినిపిస్తోంది. కొన్ని కీలకమైన ప్రశ్నలకు ఆయనకు తెలీదని చెప్పటం కానీ.. తాను పర్యవేక్షణ చేస్తుంటానని.. ఫాలో అప్ మాత్రమే తన బాద్యత అన్న రీతిలో సమాధానం ఇవ్వటం ఆయన మీద వేలెత్తి చూపించే పరిస్థితి కొంత మేర మాత్రమే ఉంటుంది తప్పించి.. చర్యలు తీసుకునే వరకు వెళ్లదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అదే సమయంలో ఈ ఉదంతం జరిగిన వేళలో శంషాబాద్ డీసీపీగా ఉన్న ప్రకాశ్ రెడ్డిని మరోసారి విచారణకు హాజరు కావాలన్న ఆదేశాలు వెలువడ్డాయి. ఇప్పటికే విచారణను ఎదుర్కొన్న ఆయన.. సజ్జన్నార్ చెప్పిన సమాధానాలకు ఆయన తిరిగి వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే.. ఈ విచారణ ఎపిసోడ్ లో సజ్జన్నార్ కంటే కూడా శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డికే ఎక్కువ ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.