Begin typing your search above and press return to search.

దసరా ఆఫర్ కోసం రోహిత్ శర్మ, కోహ్లీలను వాడేసిన సజ్జనార్

By:  Tupaki Desk   |   27 Sep 2022 8:21 AM GMT
దసరా ఆఫర్ కోసం రోహిత్ శర్మ, కోహ్లీలను వాడేసిన సజ్జనార్
X
సజ్జనార్.. ఈ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రస్తుతం టీఎస్ ఆర్టీసీకి ఎండీగా నాన్ పోలీస్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. గతంలో వరంగల్ ఎన్ కౌంటర్, ఆ తర్వాత దిశ ఎన్ కౌంటర్ తో సజ్జనార్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. ఇప్పటికీ సజ్జనార్ క్రేజ్ తగ్గలేదు.

ఆర్టీసీ ఎండీగా కూడా ఆయన పేరు బాగా ప్రాచుర్యంలోకి వస్తోంది. సెలబ్రెటీలను తన తెలంగాణ ఆర్టీసీ సంస్థకు వాడుకోవడంలో సజ్జనార్ ను మించిన వారు లేరు. హీరోల చిత్రాలు, సినిమాల్లోని క్లిప్ లను తెగ వాడేస్తూ జనాలకు ఆర్టీసీపై నమ్మకాన్ని కలిగిస్తున్నారు.

తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను కూడా సజ్జనార్ వాడేశారు. వారి హ్యాపీ మూవెంట్ వీడియోను టీఆర్ఎస్ ఆర్టీసి ప్రచారానికి వాడేశారు. సజ్జనార్ టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ బస్సులను నెటిజన్లకు చేరువ చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారు.

ట్రెండింగ్ టాపిక్స్ తో పబ్లిసిటీని చేసుకోవడంలో సజ్జనార్ ముందుంటున్నారు. సీజన్ కు తగ్గట్టుగా ఆయన తన కొత్త కొత్త ఆలోచనలతో నెటిజన్లకు టీఎస్ ఆర్టీసీని పరిచయం చేస్తున్నారు. ఈసారి దసరా బస్సుల ఆఫర్ కోసం ఏకంగా రోహిత్ శర్మ, కోహ్లీని కూడా సజ్జనార్ వాడేయడం విశేషం.

ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన 3వ టీం హైదరాబాద్ లో జరిగింది. ఈ మ్యాచ్ లో లాస్ట్ బాల్ కు హార్ధిక్ ఫోర్ కొట్టి టీమిండియాను గెలిపించాడు. డిసైడర్ మ్యాచ్ లో ఉప్పల్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ లు మెట్లపై మునివేళ్లపై కూర్చొని లాస్ట్ ఓవర్ చూశారు. పాండ్యా గెలిపించడంతో ఇద్దరూ సంతోషంతో హగ్ చేసుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఆ వీడియోను టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. ‘పండుగ సీజన్ లో ఫుల్ బిజీగా ఉన్న బస్సులో నాన్న సీట్ సంపాదించినప్పుడు ఇలానే సంతోషిస్తాం కదా.’ అంటూ ట్వీట్ చేశారు. ఈసారి పండుగకు టీఎస్ఆర్టీసీ బస్సు టికెట్ ను ముందే బుక్ చేసుకుందాం అంటూ ఈ వీడియో కింద ప్రచారం కూడా చేసుకున్నాడు. ప్రస్తుతం సజ్జనార్ చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.