Begin typing your search above and press return to search.

ఆర్టీసీ డ్రైవర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సజ్జన్నార్

By:  Tupaki Desk   |   2 Nov 2021 11:30 AM GMT
ఆర్టీసీ డ్రైవర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సజ్జన్నార్
X
సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జన్నార్ వర్కింగ్ స్టైల్ మిగిలిన వారికి భిన్నంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. సైబరాబాద్ కమిషనర్ గా వ్యవహరించిన ఆయన.. తన హయాంలో పోలింగ్ విషయంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆయన్ను అనూహ్యంగా బదిలీ చేస్తూ.. ఆర్టీసీ ఎండీగా నియమించటం తెలిసిందే. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన పని తీరు మిగిలిన ఎండీలకు భిన్నంగా ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.

తాజాగా ఆయన చేసిన ఒక హెచ్చరిక ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆర్టీసీ డ్రైవర్లను ఉద్దేశించి ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు. ఆర్టీసీ డ్రైవర్ సంస్థకు ఫ్రంట్ లైన్ వర్కర్ అని.. అతను పద్దతిగా ఉండాలని.. డ్రైవింగ్ సమయంలో గుట్కా.. ఇతర పొగాకు పదార్థాల్ని నములుతూ ఉమ్ముతూ బస్సును అపరిశుభ్రంగా మారిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

బస్సు వెనుక వచ్చే వారికి అసౌకర్యాన్ని కలిగిస్తే సహించేది లేదన్న ఆయన.. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వును జారీ చేశారు. దీన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని ఆదేశించారు. ఎవరైనా.. దీనికి భిన్నంగా నడుచుకుంటే వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆర్టీసీ డ్రైవర్లలో కొందరికి గుట్కా.. ఇతర పొగాకు పదార్థాలు నమలటం అలవాటుగా ఉందని.. వాటిని నమిలి బస్సు లోపలే ఉమ్మేస్తున్నారని.. దీని కారణంగా బస్సులో దుర్వాసనకు కారణమవుతుందన్నారు. తనకు ఇలాంటి ఫిర్యాదులు వస్తున్నాయని.. ఇలాంటి వాటిని తీవ్రంగా పరిగణిస్తానని ఆయన స్పష్టం చేశారు. తాజా ఉత్తర్వులో సజ్జన్నార్ మార్కు స్పష్టంగా కనిపిస్తుందన్న మాట వినిపిస్తోంది.