Begin typing your search above and press return to search.
సాక్షి విలేకరిపై వైసీపీ ఎమ్మెల్యే తనయుడి దాడి!!
By: Tupaki Desk | 8 March 2016 6:02 AM GMTఅవును మీరు సరిగానే చదివారు. ఏపీ ప్రతిపక్ష నేత - వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు చెందిన సాక్షి పత్రిక విలేకరిపై ఆయన పార్టీ ద్వారా గెలిచిన ఎమ్మెల్యే తనయుడే దాడిచేశాడు. చితకబాదింది విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమారుడు కాగా ఆయన దాడి చేసింది తాడేపల్లి పట్టణ సాక్షి విలేకరిగా పనిచేస్తున్న టి.నాగిరెడ్డిపై.
ఇంతకీ విషయం ఏమిటంటే ఎమ్మెల్యే కుమారుడు - అతని అనుచరులు కొందరు ఒక వ్యక్తిని బలవంతంగా తమ కారులో తరలిస్తున్నారనే సమాచారం స్థానిక సాక్షి విలేకరికి అందింది. దీంతో ఈ విషయాన్ని సేకరించేందుకు నాగిరెడ్డి ఉండవల్లి సెంటర్ లో వేచి ఉన్నాడు. అంతలో ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు అదే సెంటర్ కు రాగా... ఫొటోలు తీసేందుకు విలేకరి ప్రయత్నించాడు. దీంతో ఎమ్మెల్యే కుమారునితో పాటు కారులో ఉన్న మరో ఐదుగురు విలేకరిపై దౌర్జన్యానికి దిగి కెమెరాను లాక్కుని పగులగొట్టారు. ఈలోగా అక్కడ పెద్దఎత్తున జనం చేరారు.ఈ సమాచారమందుకున్న ఎమ్మెల్యే అనుచరులు మరో ఏడుగురు అక్కడికి చేరుకుని విలేకరిని తీవ్రంగా దుర్భాషలాడి దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీంతో బాధిత సాక్షి విలేకరి తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కుమారునితోపాటు మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకో ఆరుగురు పరారీలో ఉన్నారు.
కొద్దికాలం క్రితమే జలీల్ ఖాన్ టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో సైకిలెక్కిన సంగతి తెలిసిందే.