Begin typing your search above and press return to search.

ఏడాపెడా మాటల ‘సాక్షి’పై కేసులు పెట్టేశారు

By:  Tupaki Desk   |   8 Jan 2017 5:41 AM GMT
ఏడాపెడా మాటల ‘సాక్షి’పై కేసులు పెట్టేశారు
X
ప్రత్యర్థులపై విరుచుకుపడటం రాజకీయాల్లో మామూలే. కానీ.. దానికో హద్దు ఉంటుంది. లక్ష్మణరేఖను దాటి మాట్లాడటం ఎవరికి సరి కాదు. మనసులో అనిపించిన ప్రతిమాటనుచెప్పేయటం.. అది కూడా ఒకరిద్దరు వ్యక్తులను లక్ష్యం చేయటం కాకుండా.. ఒక వర్గాన్ని లక్ష్యం చేస్తూ మాట్లాడటం ఏమాత్రం సరికాదు. కానీ.. చేసిన తప్పును అదే పనిగా చేయటం బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ కు అలవాటే. తాజాగా ఆయన మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశ జనాభా పెరగటానికి ముస్లింలు కారణం అన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారటమే కాదు.. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

నలుగురు భార్యలు.. నలభైమంది సంతానం కలిగి ఉన్న వారే దేశ జనాభా పెరిగిపోవటానికి కారణంగా ఆయన అభివర్ణించారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్.. హాట్ గా మారాయి. ఎన్నికలు ముంగిట్లోకి వచ్చిన వేళ.. ఒక వర్గాన్ని తప్పు పడుతూ.. వారిని భావోద్వేగాల్ని టచ్ చేసేలా వ్యాఖ్యలు చేయటంపై పలువురు తప్పు పడుతున్నారు.

ఇదిలా ఉంటే.. సాక్షి మహారాజ్ చేసిన వ్యాఖ్యలు సుప్రీంకోర్టు.. ఎన్నికల సంఘం చేసిన మార్గదర్శకాలకు విరుద్దంగా ఉన్నాయన్నవిమర్శలు పెరుగుతున్నాయి. సాక్షి వ్యాఖ్యలతో ఇరుకున పడ్డ బీజేపీ.. ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవని.. పార్టీకి ఏ మాత్రం సంబంధం లేవని చెప్పటం చూస్తే.. సాక్షి మాటలు ఎంత డ్యామేజింగ్ గా ఉన్నాయన్న విషయం ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు. ఆయన చేసిన వ్యాఖ్యలపై కేసులు నమోదు అవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. తన మాటలు ఒక వర్గాన్ని.. ఆ వర్గ మహిళల్ని అగౌరవపరిచేలా ఉన్నాయన్న వాదనను సాక్షి తోసిపుచ్చారు. ముస్లిం మహిళలు యంత్రాలు కాదు.. వాళ్లను గౌరవించాలి..నలుగురు భార్యలు.. 40 మంది పిల్లలు.. ట్రిపుల్ తలాఖ్ లను ఇక సహించకూడదు.. దీనిపైనిర్ణయం తీసుకోవాలంటూ తన మాటల వెనుకున్న విషయం ఏమిటో చెప్పే ప్రయత్నం చేశారు. ముస్లిం మహిళల సమస్యల్ని తెర మీదకు తీసుకురావటానికి.. ఆవర్గాన్నికించపరిచేలా మాత్రమే మాట్లాడాలా? అంతకు మించిన ప్రత్యామ్నాయం లేదా? అన్నది అసలు ప్రశ్న.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/