Begin typing your search above and press return to search.
ఆ బీజేపీ ఎంపీ మాటలు వింటే ఛీ అనేస్తారంతే
By: Tupaki Desk | 26 Aug 2017 7:06 AM GMTనిన్నటి వరకూ భావోద్వేగ మాటలుగా ఉన్న భారత సంస్కృతి.. సంప్రదాయం రానున్న రోజుల్లో అసహ్యించుకునే వరకూ వెళ్లనున్నాయా? అవసరం ఉన్నా.. లేకున్నా.. ప్రతి మాటకు చివరా భారత సంస్కృతి సంప్రదాయాల్ని తెర మీదకు తీసుకొస్తున్న బీజేపీకి చెందిన కొందరు నేతల మాటలు చిరాకు తెప్పించటమే కాదు.. ఆ మాట వింటేనే ఛీ కొట్టేస్తారేమోనన్న భావన కలుగుతుందని చెప్పక తప్పదు.
రేప్ చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొని.. చివరకు అవన్నీ నిజాలని కోర్టు తేల్చటంతో తీవ్ర ఇబ్బందుల్లో ఇరుక్కున్న రేపిస్ట్ డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మిత్ రామ్ రహీం సింగ్ కు మద్దతుగా నిలిచి షాకిచ్చారు బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్. వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఈ పెద్ద మనిషి.. తాజాగా గుర్మిత్‌ను తాను సమర్థిస్తానని.. ఆయనకు తాను మద్దతు ఇస్తున్నట్లుగా చెప్పారు.
పంచకల సీబీఐ కోర్టు గుర్మిత్ ను దోషిగా నిర్దారిస్తూ సంచలన తీర్పు వెల్లడించిన కొన్ని గంటల వ్యవధిలోనే బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గుర్మిత్ ను కోట్లాది మంది ప్రజలు.. అనుచరులు అనుసరిస్తున్నారని.. అలాంటి గొప్ప వ్యక్తిపై కోర్టులు తీర్పులు వెలువరించటం భారతీయ సంస్కృతిని అపఖ్యాతి పాల్జేయటమేనన్నారు. భారతదేశ సంస్కృతిని దెబ్బ తీసే కుట్రలో భాగంగానే గుర్మిత్ ను దోషిగా తేల్చినట్లుగా చెబుతున్నారు.
గుర్మిత్ పై కేసుకు నిరసనగా సాగుతున్న హింసాకాండకు కోర్టు బాధ్యత వహించాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఎంపీ సాక్షి చేస్తున్న వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. రేప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న గుర్మిత్ ను వెనకేసుకొస్తూ.. కోర్టులపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న సాక్షి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవిగా బీజేపీ స్పష్టం చేస్తుంది. నిన్నటి వరకూ పలు అంశాల్లో తీవ్ర వ్యాఖ్యలు చేసినా ఎంపీ సాక్షి మహారాజ్ ను వెనకేసుకొచ్చిన వారు సైతం.. తాజా గుర్మిత్ ఎపిసోడ్ మీద ఆయన తీరును తప్పు పడుతున్నారు. ఇక..కొందరైతే ఛీ కొడుతున్నారు.