Begin typing your search above and press return to search.
సాక్షీ.. నాతో కుస్తీ పోటీకి దిగవనే నమ్ముతున్నా!
By: Tupaki Desk | 26 Aug 2016 4:23 AM GMTఒక్కసారి బ్యాట్ పట్టి మైదానంలోకి దిగితే బౌలర్ ఎవరనేది చూడడు.. వేసిన ప్రతి బంతికి ఊచకోత తప్ప క్షమాబిక్ష ఉండదు.. అర్ధమయ్యే ఉంటుంది అది వీరేంద్ర సెహ్వాగ్ గురించిన లైన్ అని. విమర్శలకు ఎప్పుడూ తన బ్యాట్ తోనే సమాధానం చెప్పే భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ట్విట్టర్ లో చురుగ్గా ఉంటున్నాడు.. ఇటీవల కాలంలో స్ఫూర్తిదాయక సందేశాలను కూడా పోస్టు చేస్తున్నారు.
తాజాగా ఒలింపిక్స్ రెజ్లింగ్ లో కాంస్య పతకం అందుకున్న సాక్షి మలిక్ సెహ్వాగ్ కు ఒక రిక్వస్ట్ చేసింది. "మిమ్మల్ని కలవాలనుంది. వీలైతే చెప్పండి" అంటూ సెహ్వాగ్ కు ట్వీట్ చేసింది సాక్షి. ఆమె ట్వీట్ కు స్పందించిన సెహ్వాగ్.. "కచ్చితంగా కలుద్దాం. కానీ కలిసిన తర్వాత నాతో కుస్తీ పోటీకి దిగవనే నమ్ముతున్నా" అంటూ తనదైన శైలిలో స్పందించి నవ్వులు పూయించాడు.
ఇదే క్రమంలో ఒలింపిక్స్ లో భారత్ ను విమర్శించిన ఓ విదేశీ జర్నలిస్టుకి చెంప ఛెళ్లుమనింపిచేలా సమాధానమిచ్చిన సెహ్వాగ్ భారతీయులందరితోనూ శభాష్ అనిపించుకున్నారు. "125 కోట్ల మంది జనాభా ఉన్నా.. కేవలం రెండంటే రెండు పతకాలు సాధించి దానికే సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారు" అంటూ బ్రిటీష్ జర్నలిస్టు పియర్స్ మోర్గాన్ వ్యాఖ్యానించాడు. ఈ విషయంపై స్పందించిన సెహ్వాగ్... "భారతీయులంతా ప్రతి చిన్న విషయానికీ ఆనందిస్తూనే ఉంటారు" అని ట్వీట్ చేశారు. ముందుగా అలా సమాధానం చెప్పిన సెహ్వాగ్.. మోర్గాన్ కు ఒక ప్రశ్న కూడా వేశాడు..."క్రికెట్ ను కనుగొన్నది తామేనంటూ జబ్బలు చరుచుకునే ఇంగ్లాండ్.. ఇంతవరకు ఒక్కసారి కూడా ప్రపంచకప్ గెలవలేదు. అయినా ఇప్పటికీ ప్రపంచకప్ లో ఆడుతూనే ఉండటం ఇబ్బందికరంగా ఏమీ లేదా?" అని మోర్గాన్ చెంప ఛెళ్లుమనిపించేలా మరో ట్వీట్ చేశారు సెహ్వాగ్.
అయితే అది అక్కడితో ఆగలేదు. సెహ్వాగ్ ట్వీట్ కు మోర్గాన్ మరోసారి స్పందించాడు. కెవిన్ పీటర్సన్ ఆడి ఉంటే, ఇంగ్లాండ్ తప్పనిసరిగా ప్రపంచకప్ గెలిచేదని చెప్పుకొచ్చాడు. దీనిపై స్పందించిన వీరు... "అసలు పీటర్సన్ ఇంగ్లాండ్ వ్యక్తే కాదు. దక్షిణాఫ్రికాలో పుట్టాడు, అందులోనూ ఆయన 2007 ప్రపంచకప్‌లో ఆడాడు.. అయినా కూడా ఇంగ్లండ్ ఓడిపోయింది" అని చకచకా చెప్పేశాడు. దాంతో మోర్గాన్ మాట్లాడేందుకు ఏమీ లేక నోరు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దీంతో ఒక్కసారిగా సెహ్వాగ్ సమాధానానికి ట్విట్టర్ లో లైక్స్ భారీగా పెరిగిపోయాయి. అంతేగాక, అలాంటి వారికి సరైన సమాధానం ఇచ్చావంటూ నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తున్నాయి. ఇలా కొందరిని నవ్విస్తూ.. మరికొందరిని కవ్విస్తూ.. తన దైన ట్వీట్లతోనూ ఆకట్టుకుంటున్నాడు వీరేంద్రుడు.