Begin typing your search above and press return to search.

టీవీ9 వద్ద ఉద్రిక్తత.. సాక్షి ప్రతినిధిపై జులం

By:  Tupaki Desk   |   10 May 2019 12:28 PM IST
టీవీ9 వద్ద ఉద్రిక్తత.. సాక్షి ప్రతినిధిపై జులం
X
టీవీ9 యాజమాన్య మార్పు వివాదం పోలీస్ స్టేషన్ కు చేరడం.. టీవీ9 సీఈవో రవిప్రకాష్ కు పోలీసులు నోటీసులు ఇవ్వడం.. టీవీ9 కార్యాలయాల్లో సోదాల నేపథ్యంలో మీడియా అంతా ఇప్పుడు బంజారాహిల్స్ లోని టీవీ9 కార్యాలయం వద్ద మోహరించి అప్ డేట్స్ కవర్ చేస్తోంది.

ఈ కోవలోనే టీవీ9 కార్యాలయం వద్ద కవరేజ్ కు వెళ్లి లైవ్ ఇస్తున్న సాక్షి మీడియా ప్రతినిధి పై రవిప్రకాష్ అనుచరులు దౌర్జన్యం చేశారు. గేటు బయట ఉండే సాక్షి ప్రతినిధి లైవ్ ఇస్తున్నా.. చిత్రీకరించకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.

అనంతరం ఎంతకూ సాక్షి ప్రతినిధి వెళ్లకపోవడంతో రవిప్రకాష్ అనుచరులు దురుసుగా ప్రవర్తించారు. కెమెరాను లాక్కునే ప్రయత్నం చేశారు. లైవ్ కవరేజ్ చేస్తున్న సాక్షి వాహనం వైర్లు పీకేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

కాగా టీవీ9 కార్యాలయం వద్ద మిగతా చానెల్స్ ప్రతినిధులు ఉన్నప్పటికీ కేవలం సాక్షి మీడియా ప్రతినిధినే రవిప్రకాష్ అనుచరులు టార్గెట్ చేయడం వివాదాస్పదమైంది. రోడ్డుకు అడ్డంగా ఉన్నారని.. తమకు ఇబ్బంది కలిగిస్తున్నారంటూ వారు సాక్షి ప్రతినిధిపై దౌర్జన్యానికి దిగారు. రవి ప్రకాష్ అనుచరుల దౌర్జన్యమంతా వీడియోల్లో రికార్డ్ అయ్యి మీడియాలో ప్రముఖంగా వస్తోంది.