Begin typing your search above and press return to search.
సీఎంల జీతాలు: కేసీఆర్ నంబర్1, లాస్ట్ ఎవరంటే
By: Tupaki Desk | 9 July 2020 12:30 PM GMTదేశంలోనే ధనిక రాష్ట్రమని ప్రకటించిన సీఎం కేసీఆర్.. అందుకు తగ్గట్టుగా వేతనాలు తీసుకోకపోతే ఏం బావుంటుంది. అందుకే దేశంలోనే ముఖ్యమంత్రిగా అత్యధిక వేతనం తీసుకునే జాబితా మన కేసీఆర్ సారే నంబర్ 1గా నిలిచారు. విధానపరమైన విషయాలపై నిర్ణయాలు తీసుకోవడంలో.. అభివృద్ధి మార్గంలో రాష్ట్రాన్ని నడిపించడంలో ముఖ్యమంత్రులు చాలా ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. వారి సేవలకు ప్రజలు చెల్లించాల్సిందే. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం కేసీఆర్ ఇంకా ఎక్కువే చెల్లించేస్తున్నారు. ఆయన ఖర్చులను కూడా భరిస్తున్నారు. మన దేశంలోని సీఎంలు వారి సేవలకు అందుకుంటున్న జీతాలు బహుభారీగానే ఉన్నాయి. ఆ లెక్కలేంటో చూద్దాం.
దేశంలోని సీఎంలందరిలోకి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఎక్కువగా వసూలు చేస్తున్నారు. కేసీఆర్ అందుకునే మొత్తం దేశంలో అత్యధిక జీతం కావడం గమనార్హం. తెలంగాణ సీఎంగా కేసీఆర్ నెలకు రూ.4,10,000 వేతనం తీసుకుంటాడు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ 3,35,000 రూపాయలు తీసుకుంటూ దేశంలో ఐదో అత్యధిక జీతం తీసుకుంటున్న సీఎంగా నిలిచాడు..
కేసీఆర్ తర్వాత రెండో స్థానంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. ఆయన కేసీఆర్ కంటే ఓ పదివేలు తక్కువగా నెలకు రూ .4,00,000 తీసుకుంటూ రెండో స్థానంలో నిలిచాడు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రూ.3,65,000 తో మూడో స్థానంలో, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే రూ.3, 40,000 తో నాలుగో స్థానంలో ఉన్నారు.
గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రూ .3,21,000 డ్రా చేస్తుండగా.. హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ 3,10,000 రూపాయలు. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖత్తర్ రూ .2,88,000, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ రూ .2,72,000, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రూ .2,55,000 తీసుకుంటారు.
ఛత్తీస్‌గఢ్ సిఎం భూపేష్ బాగెల్, పంజాబ్ సిఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ నెలకు రూ .2,30,000 తీసుకుంటారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్ రూ .2,20,000 , బీహార్ సీఎం నితీష్ కుమార్ రూ .2,15,000, పశ్చిమ బెంగాల్‌లో ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీ రూ .2,10,000 తీసుకుంటుంది.
తమిళనాడు సిఎం కె. పళనిసామి రూ .2,05,000, కర్ణాటక సిఎం యెడియరప్ప రూ .2,00,000, సిక్కిం సిఎం ప్రేమ్ సింగ్ తమంగ్ రూ .1,90,000, కేరళ సిఎం పినరయి విజయన్, త్రిపుర సిఎం బిప్లాబ్ కుమార్ దేబ్ రూ .1,85,000 తీసుకుంటున్నారు.
మిజోరం సిఎం జొరామ్‌తంగా రూ .1,84,000 తీసుకుంటుండగా, అతని సహచరులు అశోక్ గెహ్లోట్ (రాజస్థాన్), త్రివేంద్ర సింగ్ రావత్ (ఉత్తరాఖండ్) ఒక్కొక్కరు 1,75,000 రూపాయలు తీసుకుంటారు.
ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్ 1,65,000 రూపాయలు, నాగాలాండ్ సిఎం నీఫియు రియో 1,10,000 రూపాయలు మాత్రమే తీసుకుంటున్నారు.
ఇలా దేశంలోనే అత్యధిక వేతనం తీసుకునే సీఎంగా మన ధనిక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఠీవీని నిలబెట్టుకున్నారు. ఇక హిమాలయరాష్ట్రం సిక్కిం సీఎం రియో కేవలం 1,10,000 మాత్రమే తీసుకుంటూ అందరికంటే తక్కువ తీసుకునే సీఎంగా నిలిచాడు.