Begin typing your search above and press return to search.
కేసీఆర్ లెక్కలో ఎమ్మెల్యేల నెల ఖర్చు 3 లక్షలు?
By: Tupaki Desk | 10 Feb 2016 4:35 AM GMTజీతాల పెంపు విషయంలో చేతికి ఎముక లేనట్లుగా వ్యవహరించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధుల జీతభత్యాల మీద దృష్టి పెట్టారు.నిత్యం నేతల అవినీతి గురించి మాట్లాడే వారంతా.. వారికి అయ్యే ఖర్చులు..వారికి అధికారికంగా జీతభత్యాల గురించి పెద్దగా ఆలోచించరనే చెప్పాలి. మిగిలిన వారిలా వ్యవహరిస్తే తెలంగాణ ముఖ్యమంత్రి గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. మిగిలిన వారు ఏ కోణంలో ఆలోచించరో.. ఆ కోణంలో ఆలోచించటం కేసీఆర్ స్పెషాలిటీ అన్న విషయాన్ని మర్చిపోకూడదు.
తాజాగా ఆయన.. ప్రజాప్రతినిధుల జీతభత్యాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీలకు జీతాలు పెంచాలంటూ వచ్చిన ఒక ప్రతిపాదన కేసీఆర్ ఎదుట వచ్చిన సందర్భంగా ఆయన లెక్క వింటే.. ఒక అంశం మీద ఎంత సునిశితంగా దృష్టి సారిస్తారన్న భావన కలగటం ఖాయం. ప్రజాప్రతినిధుల జీతాల పెంపు అంశంపై అసెంబ్లీ కార్యదర్శి.. ఇతర అధికారులతో చర్చ సందర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయని చెబుతున్నారు. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీల జీతభత్యాల మీద ప్రజల్లో చాలానే అపోహలు ఉన్నాయని.. నిజానికి వారి జీతభత్యాలతో పోలిస్తే.. నెలసరి అయ్యే ఖర్చు భారీగా ఉంటుందని.. ఆదాయానికి.. ఖర్చుకు ఏ మాత్రం పోలిక ఉండదంటూ చెప్పటం గమనార్హం.
ప్రజాప్రతినిధులకు ఇచ్చే జీతాలు వారికేమాత్రం సరిపోవటం లేదన్న అభిప్రాయాన్ని బలంగా వినిపించిన కేసీఆర్.. ప్రతి ఎమ్మెల్యేకు.. ఎమ్మెల్సీకి రాజకీయ.. రాజకీయేతర ఖర్చులు ఉంటాయన్న విషయాన్ని మర్చిపోకూడదని చెప్పుకొచ్చినట్లు చెబుతున్నారు. వారు నిత్యం తిరుగుతూ ఉండాలని.. గ్రామాల్లో నిర్వహించే సభలు.. సమావేశాలతో పాటు.. పలు కార్యక్రమాలకు హాజరు కావాల్సి వస్తుందని.. వారితో పాటు ఉండే అనుచర గణానికి అయ్యే ఖర్చుతో పాటు.. వారి కుటుంబ పోషణకు అయ్యే ఖర్చులు.. మారిన కాలానికి తగ్గట్లుగా ఎమ్మెల్యే స్థాయి జీవన ప్రమాణాలు అన్ని చూసుకుంటే నెలకు రూ.3లక్షల ఖర్చు ప్రతి ఎమ్మెల్యేకి ఉంటుందని లెక్క తేల్చారు. ఈ నేపథ్యంలో నెలవారీగా వాస్తవంగా అయ్యే ఖర్చు ఇంత భారీగా ఉన్న నేపథ్యంలో వారి జీతాలు ఎంత పెంచితే సమంజసంగా ఉంటుందన్న విషయంపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయాన్ని కేసీఆర్ వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. సో.. తెలంగాణ ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీల జీతాల భారీ పెంపు త్వరలోనే ఉంటుందన్న మాట.