Begin typing your search above and press return to search.

ఓ రేంజ్ లో టీ ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీల జీతాలు

By:  Tupaki Desk   |   28 March 2016 12:27 PM GMT
ఓ రేంజ్ లో టీ ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీల జీతాలు
X
ప్రజాసేవ చేయటం ఎంత ఖరీదైన వ్యవహారమో తాజాగా తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ సర్కారు ప్రవేశ పెట్టిన బిల్లును చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ప్రజలకు సేవ చేయటానికి.. వారి కోసం అవసరమైతే తమ జీవితాల్ని త్యాగం చేయటానికి సిద్ధమని చెప్పుకునే నేతలకు జీతాలు కార్పొరేటర్ల తరహాలో భారీగా పెంచాలన్న అంశంపై చర్చ జరిపేందుకు మంత్రి హరీశ్ రావు బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు.

తెలంగాణ ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలకు ప్రస్తుతం నెలకు రూ.95 వేల వరకు జీతాలు వస్తున్నాయి. మారిన జీవన ప్రమాణాలతో ఈ జీతం ఏ మాత్రం సరిపోవటం లేదంటూ తాజాగా భారీ మొత్తాన్ని పెంచుతూ టీ సర్కారు బిల్లు ప్రవేశ పెట్టింది. ఈ బిల్లు కానీ ఓకే అయితే.. ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీల జీతాలు రూ.95 వేల నుంచి ఏకంగా రూ.2.58 లక్షలకు పెంచుతూ ప్రతిపాదించారు.

జీతంలో హెచ్ ఆర్ ఏ ను రూ.25 వేల నుంచి ఏకంగా రూ.50వేలకు పెంచగా.. బేసిక్ ను రూ.20వేలు పెంచుతూ ప్రతిపాదించారు. స్పెషల్ కారు అలవెన్స్ గా రూ.25వేలు .. నియోజకవర్గ స్పెషల్ అలవెన్స్ రూ.83 వేలు పెంచనున్నారు. తాజాగా పెంచాలని భావిస్తున్న జీతాల కారణంగా తెలంగాన సర్కారు మీద రూ.42.67 కోట్ల అదనపు భారం పడనుంది. ప్రజలకు సేవ చేసే ప్రజాప్రతినిధుల కారణంగా ప్రభుత్వంపై ఆ మాత్రం భారం పెద్ద విషయం కాదంటారేమో..?