Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ భూముల‌ అమ్మకం.. తెలంగాణ స‌ర్కారు నిర్ణ‌యం

By:  Tupaki Desk   |   28 Aug 2021 3:30 PM GMT
మ‌ళ్లీ భూముల‌ అమ్మకం.. తెలంగాణ స‌ర్కారు నిర్ణ‌యం
X
భూముల విక్ర‌యం ద్వారా కోట్ల రూపాయ‌లు గ‌డిస్తూ.. ఆర్థిక ఇబ్బందుల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప్ర‌య త్నిస్తున్న తెలంగాణ స‌ర్కారు మ‌రో సారి.. ఇదే వ్యూహాన్ని ప్లే చేస్తోంది. క‌రోనా నేప‌థ్యంలో ఏర్ప‌డిన ఆర్థిక లోటును పూడ్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల హైద‌రబాద్‌లోని కోకాపేట ప్రాంతానికి చెందిన భూముల్ని వేలం వేయగా, సర్కారువారి పాటకు రెట్టింపు ధరకు స్థలం అమ్ముడుపో యింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ కోకాపేట భూములకు ఈ-ఆక్షన్ నిర్వహించారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కోకాపేట ప్రాంతంలో 49.92 ఎకరాలను ఎంఎస్‌టీసీ వెబ్‌సైట్‌ ద్వారా హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) వేలం నిర్వహించగా సర్కారుకు కాసుల పంట పండింది. ఎకరా భూమికి ప్రాధమిక ధరను ప్రభుత్వం రూ.25 కోట్లుగా నిర్ధారించగా, కోకాపేటలో ఏకంగా ఎకరం రూ.50 కోట్లకు అమ్ముడు పోయింది. హెచ్ఎండీఏకు చెందిన 49.2 ఎకరాల్లో 8 ప్లాట్లుకు జరిగిన ఈ-వేలంలో 60 మంది బిడ్డర్స్‌ పాల్గొన్నారు. 1, 2, 3, 12 ప్లాట్లు అమ్ముడుపోయాయి.

కోకాపేటలోని భూముల్ని అమ్మేసిన ప్రభుత్వం, ఇప్పుడు తాజాగా ఇదే బాట‌లో ఖానామెట్‌లో వున్న 15 ఎకరాల భూమిని వేలం వేసేందుకు రెడీ అయింది. ఈ వెంచర్‌కు గోల్డెన్‌ మైల్‌ అని పేరు పెట్టారు. ఈ భూములకు కూడా భారీ ధర దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దగ్గరుండి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా పుప్పాల గూడ‌లోని భూముల‌ను కూడా వేలం వేయ‌నున్నారు. కాగా, కోకాపేట, ఖానామెట్‌ భూముల వేలం ఆపాలని బీజేపీ నేత విజయశాంతి వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేయడంతో వేలానికి మార్గం సుగమం అయింది.

తాజాగా అమ్మ‌నున్న భూములు ఇవే..
ఖాన్‌మేట్ = 22.79 ఎక‌రాలు, 9 ఫ్లాట్లు
పుప్పాల‌గూడ = 94.56 ఎక‌రాలు, 29 ఫ్లాట్లు