Begin typing your search above and press return to search.

ఆ కేసు కోసం రూ.25కోట్లు ఖర్చు చేశాడంట

By:  Tupaki Desk   |   14 Dec 2015 5:49 AM GMT
ఆ కేసు కోసం రూ.25కోట్లు ఖర్చు చేశాడంట
X
పుష్కర కాలానికి పైనే సాగిన హిట్ అండ్ రన్ కేసు విషయంలో బాంబే హైకోర్టు మూడు రోజుల కిందటే తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో కండల వీరుడు సల్మాన్ కొద్దికాలం జైల్లో ఉండాల్సి వచ్చింది. దాదాపు 13 ఏళ్లపాటు సాగిన ఈ కేసులో.. అంతిమంగా సల్మాన్ కు అనుకూలంగా తీర్పు రావటం ఒక ఆసక్తికర అంశంగా మారింది. కింది కోర్టు తీర్పునకు భిన్నంగా.. సల్మాన్ చేసిన నేరంగా చెబుతున్న ఉదంతానికి సంబంధించి.. ప్రాసిక్యూషన్ వాదన నేరం చేశారన్నట్లుగా లేదని తేల్చేయటం తెలిసిందే.

ఇదే కేసునకు సంబంధించి కింది కోర్టు జైలు శిక్ష విధిస్తే.. అందుకు భిన్నంగా బాంబే హైకోర్టు మాత్రం నేరాన్ని నిరూపించేందుకు అవసరమైన ఆధారాలు బలంగా లేవంటూ కేసును కొట్టేసి.. సల్మాన్ కు ఊరట కలిగించిన కేసుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని సల్మాన్ తండ్రి.. బాలీవుడ్ సినీ రచయిత సలీంఖాన్ చెప్పుకొచ్చారు.

హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించి సల్మాన్ ఖర్చు దాదాపు రూ.25కోట్లు వరకూ ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ కేసు కారణంగా 13 సంవత్సరాలుగా ఎంతో మానసిక క్షోభతో పాటు.. రూ.25కోట్ల భారీ మొత్తాన్ని ఖర్చు చేసిన విషయాన్ని తాజాగా ఆయన మీడియాకు చెప్పారు. ఇంత భారీ మొత్తం ఖర్చు చేసిన తర్వాత.. ‘‘చట్టం తన పని తాను చేసుకుంటూ పోదు కదా?’’