Begin typing your search above and press return to search.
సల్మాన్ కు షాకిచ్చిన మహారాష్ట్ర సర్కారు
By: Tupaki Desk | 23 Dec 2015 9:49 AM GMTబాలీవుడ్ నటుడు.. కండల వీరుడుగా సుపరిచితుడైన సల్మాన్ ఖాన్ కు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. పుష్కర కాలానికి పైనే సాగిన హిట్ అండ్ రన్ కేసులో ఇటీవల బాంబే హైకోర్టు నుంచి నిర్దోషిగా విడుదలైన సంగతి తెలిసిందే. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంను ఆశ్రయించాలని మహారాష్ట్ర సర్కారు తాజాగా నిర్ణయించింది.
మద్యం తాగి.. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఫుట్ పాత్ మీద నిద్రిస్తున్న వ్యక్తి మరణానికి సల్మాన్ కారణంగా ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సుదీర్ఘ విచారణ జరిగాక.. ఇటీవలే.. దీనిపై బాంబే హైకోర్టు తీర్పు వెలువరిస్తూ.. సల్మాన్ ఖాన్ ను నిర్దోషిగా తేల్చింది. సల్మాన్ నేరం చేసినట్లుగా నిరూపించే ఆధారాల్ని చూపించటంలో విఫలమయ్యారంటూ కోర్టు పేర్కొంది. ఈ తీర్పుపై దేశ వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సోషల్ మీడియాలో సల్మాన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వ్యతిరేక వ్యాఖ్యలు వినిపించాయి. ఇదిలా ఉంటే.. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకు వెళ్లాలని మహారాష్ట్ర సర్కారు నిర్ణయించటం ఆసక్తికరంగా మారింది.