Begin typing your search above and press return to search.
సల్మాన్ లాయర్ కు బెదిరింపు ఫోన్లు..!
By: Tupaki Desk | 6 April 2018 10:25 AM GMTఅప్పుడెప్పుడో 20 ఏళ్ల క్రితం కృష్ణ జింకల్ని వేటాడిన కేసులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు ఐదేళ్లు జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. జోథ్ పూర్ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో బెయిల్ పిటిషన్ ను దాఖలు చేశారు సల్మాన్ తరఫు న్యాయవాది మహేశ్ బోరా.
అయితే.. దీనిపై విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. ఈ రోజు ఈ అంశంపై విచారణ జరిగే సమయంలో సల్మాన్ లాయర్ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు. తాను దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను ప్రారంభించే ముందు తన కు బెదిరింపు కాల్స్ వస్తున్నట్లుగా చెప్పారు.
సల్మాన్ బెయిల్ పిటిషన్ విచారణకు హాజరు కాకూడదని తనను బెదిరిస్తూ ఫోన్ కాల్స్.. మెసేజ్ లు వచ్చాయని చెప్పారు. ఈ కేసు నుంచి తాను తప్పుకోవాలంటూ ఒత్తిళ్లు తెస్తున్నారన్నారు. ఇదిలా ఉంటే.. సల్మాన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై తీర్పును ఇచ్చేందుకు సెషన్స్ కోర్టు రిజర్వ్ లో ఉంచింది.
దీంతో.. ఈ పిటిషన్ పై తీర్పును శనివారం వెలువరించే అవకాశం ఉంది. దీంతో.. రెండో రోజు కూడా జోథ్ పైర్ జైల్లో సల్మాన్ ఉండాల్సి వస్తోంది. ఒకవేళ.. బెయిల్ పిటిషన్ కు ప్రతికూలంగా తీర్పు వచ్చిన పక్షంలో మరికొన్ని రోజులు సల్మాన్ జైలు జీవితాన్ని గడపాల్సి ఉంటుంది ఇదిలా ఉంటే.. బెయిల్ పిటిషన్ పై విచారణకు సల్మాన్ ఇద్దరు సోదరీమణులు రాగా.. సోదరులు కూడా జోధ్ పూర్ కు వస్తారన్న ప్రచారం సాగింది.