Begin typing your search above and press return to search.
సల్మాన్ ను అతని తండ్రే తప్పు పట్టాడు
By: Tupaki Desk | 26 July 2015 9:48 AM GMTమూడు రోజులు ఆలోచించిన తర్వాతే.. తాను చెప్పాలనుకుంటున్నది చెబుతున్నానని చెప్పి.. మరో నాలుగు రోజుల్లో ఉరిశిక్ష అమలు చే్స్తున్న యాకూబ్ మెమన్‌పై బాలీవుడ్ కండల వీరుడు చేసిన సంచలన వ్యాఖ్యలపై స్పందన మొదలైంది.
250 మంది మరణాలకు కారణమైన యాకూబ్‌మెమన్ అమాయకుడని.. అతగాడిని కానీ ఉరి తీస్తే.. మానవత్వాన్ని ఉరి తీసినట్లుగా పేర్కొన్న సల్మాన్ భారీ సంచలనాన్నే సృష్టించాడు. ఆదివారం ఉదయం వరుస ట్వీట్లతో పెద్ద చర్చకే తెర తీసిన ఆయన ట్వీట్స్ కు ఇంటి నుంచే వ్యతిరేకత మొదలైంది.
సల్మాన్ తండ్రి.. సలీంఖాన్ వ్యాఖ్యానిస్తూ.. యాకూబ్ అమాయకుడని.. అతడిని ఉరి తీయటం తప్పు అంటూ సల్మాన్ చేసిన ట్వీట్ సరికాదన్నారు. సల్మాన్ వ్యాఖ్యల్ని తాను సమర్థించనని.. అర్థం లేని వ్యాఖ్యలను రాశారంటూ మండిపడ్డారు. బాలీవుడ్ లో ప్రముఖ రచయితగా పేరున్న ఈ కండల వీరుడి తండ్రికి సైతం కొడుకు వ్యాఖ్యలు మింగుడుపడనివిగా మారాయి. ఇంట్లో తండ్రే ఆ రకంగా స్పందిస్తే.. దేశంలో వివిధ వర్గాలు ఎలా రియాక్ట్ అవుతాయో..?