Begin typing your search above and press return to search.
రెజ్లర్ ను కుమ్మేసిన సాదాసీదా యువతి
By: Tupaki Desk | 18 Jun 2016 6:50 AM GMTకండలు తిరిగిన వస్తాదు రింగులో నిలబడి వీరంగం వేస్తోంది. తనతో పోటీ పడే వారు ఎవరైనా ఉన్నారంటూ చెలరేగిపోతోంది. కానీ.. ఎవరూ ఆ రెజ్లర్ తో ఢీ అంటే ఢీ అనేందుకు సిద్ధంగా లేరు. కానీ.. కాసేపటి వరకూ ఓపికతో విన్న ఓ మహిళా.. సదరు మహిళా రెజ్లర్ కు సవాలు విసిరింది. రింగులోకి వెళ్లింది. ముఖాముఖి పోరుకు సై అంది. మరి.. ఆ తర్వాత ఏం జరిగింది? ఫలితం ఎలా ఉంటుందంటే.. రెజ్లరే గెలుస్తుందని చెప్పేస్తారు. మామూలుగా అయితే.. అలా జరిగేదేమో? కానీ.. మనోధైర్యానికి ఆత్మవిశ్వాసం తోడైతే కొండను సైతం పిండి చేయొచ్చన్న నిజాన్ని మరోసారి ఆవిష్కరించి అందరిని అవాక్కు అయ్యేలా చేసిన ఘటన ఒకటి చోటు చేసుకుంది.
ది గ్రేట్ ఖలీ నిర్వహించిన కాంటినెంటల్ రెజ్లింగ్ ఎంటర్ టైన్ మెంట్ వేదిక మీద మహిళా రెజ్లర్ బీబీ బుల్ బుల్ రింగులో నిలబడి అందరికి సవాలు విసిరింది. తనతో తలపడే దమ్ము.. ధైర్యం ఎవరికైనా ఉందా? అంటూ వీరంగమే వేసింది. ఇంతలో పసుపు.. కాషాయం కలబోత సల్వార్ కమీజ్ వేసుకున్న ఒక యువతి తాను పోటీకి సై అని చెబుతూ రింగులోకి వచ్చింది. పంజాబీ అయిన ఆ అమ్మాయి పేరు కవిత. రింగులోకి వచ్చిన వెంటనే బుల్ బుల్ కళ్లల్లోకి కళ్లు పెట్టి చూసిన ఆమె.. పోరుకు సై అంది. అయితే.. మొదటి పంచ్ కు ఎగిరి ఓ మూలకు పడింది కవిత. సివంగిలా లేచిన ఆమె తన విశ్వరూపాన్నే ప్రదర్శించింది.
కవిత దెబ్బకు అంత పెద్ద రెజ్లర్ బుల్ బుల్ మళ్లీ పైకి లేవలేకపోయింది. నోట మాట రాక.. కవిత పంచ్ లకు తాళ లేకపోయింది. దీంతో.. పరిస్థితిని అర్థం చేసుకున్న నలుగురైదుగురు మగ రెజ్లర్లు వచ్చి కవితను పక్కన పెట్టి.. ఆమెను శాంతించే ప్రయత్నం చేశారు. ఇంతకీ ఈ కవిత ఎవరన్న విషయానికి వెళితే.. ఆమె గతంలో హర్యానా పోలీస్ శాఖలో ఉద్యోగం చేశారు. ఎంఎంఎ ఛాంపియన్ అన్న విషయం బయటకు వచ్చింది. ఏమైనా ఆమె దెబ్బకు బుల్ బుల్ చుక్కలు కనిపించాయనే చెప్పాలి. మరి.. ఆ ఆసక్తికర వీడియోనూ మీరూ చూస్తారా..? ఆలస్యం ఎందుకు చూడండి..