Begin typing your search above and press return to search.
బిలియనీర్ నుంచి బేకార్ గా మార్చిన క్రిప్టో
By: Tupaki Desk | 11 Nov 2022 2:30 PM GMTక్రిప్టో కరెన్సీ వర్గాల్లో మేధావిగా పరిగణించే శామ్ బ్యాంక్ మన్ ఫైడ్ కు ఊహించని షాక్ తగిలింది. ఆయన ఏర్పాటు చేసిన క్రిప్టో ఎక్స్చేజి 'ఎఫ్.టీఎక్స్' కుప్పకూలడంతో ఒక్కరోజులోనే 14.5 బిలియన్ డాలర్ల (రూ.1.20 లక్షల కోట్లు) సంపద కోల్పోయారు. ఇది ఆయన మొత్తం సంపదలో 94 శాతం ఆవిరైపయింది.
ఎఫ్.టీఎక్స్ కు నగదు లభ్యత సమస్య తలెత్తిందన్న వార్తలు రావడంతో ఇన్వెస్టర్లు కలవరపడ్డారు. దీంతో ఎఫ్.టీటీ, ఎఫ్.టీఎక్స్ టోకెన్ లను అమ్మేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
సామ్ బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ యొక్క క్రిప్టోకరెన్సీ సామ్రాజ్యం వేగవంతమైన పతనం ప్రపంచాన్ని కలవరపెట్టింది. ఎంత బాగా క్రిప్టో కరెన్సీతో ఎదిగాడో ఆయన అంతే వేగంతో పడిపోయాడు. బహామాస్‌లోని విలాసవంతమైన పెంట్‌హౌస్ లో ఉండే 30 ఏళ్ల బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ ఇప్పుడు రోడ్డునపడ్డాడు. క్రిప్టో ఎక్స్ఛేంజ్ ఎఫ్.టీఎక్స్ లో ఆయన కంపెనీ కుదేలైంది.
ఈ క్రిప్టో కరెన్సీ అనేది ఎవరి నియంత్రణలో లేకుండా లావాదేవీలు జరుగుతున్న అతిపెద్ద పెట్టుబడిదారీ వ్యవస్థ. తాజాగా క్రిప్టో ఎక్స్ఛేంజ్ కంపెనీ అయిన ఎఫ్.టీఎక్స్ ఫౌండర్, సీఈవో, సామ్ బ్యాంక్ మ్యాన్ రాత్రికి రాత్రి దివాళా తీసే పరిస్థితికి వచ్చాడు.
ఒక్క రాత్రిలో ఆయన వ్యక్తిగత సంపద ఏకంగా 94 శాతం ఆవిరై ప్రస్తుతం 991.5 బిలియన్ డాలర్లకు పడిపోయింది. బ్లూమ్ బర్గ్ రిపోర్ట్ ప్రకారం.. ఒక్కరోజులో అత్యధిక సంపద కోల్పోయిన బిలియనీర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు.
క్రిప్టో ఎక్స్చేంజ్ ఎఫ్.టీఎక్స్ ను తన ప్రత్యర్థి కంపెనీ బినాన్స్ కొనుగోలు చేస్తున్నట్టు ఈ యంగ్ బిలియనీర్ ప్రకటించిన తర్వాత బ్యాంక్ మ్యాన్ ఫ్రైడ్సంపద ఒక్క దెబ్బకు కరిగిపోయింది. ఎఫ్.టీఎక్స్ అమ్మకం వార్త వెలువడే ముందు 15.2 బిలియన్ల విలువ ఉండగా.. ఆ తర్వాత అతడి సంపద నుంచి దాదాపు 14.6 బిలియన్లు తుడిచిపెట్టుకుపోయి కేవలం చిల్లర మిగిలినట్టు అయ్యింది. ఒక్క తప్పుడు నిర్ణయం బిలియనీర్ ను బికారీని చేసి పడేసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.