Begin typing your search above and press return to search.
ఆల్ ఈజ్ వెల్ అంటూనే కొడుక్కి పెద్దాయన షాక్
By: Tupaki Desk | 26 Oct 2016 11:16 AM GMTఅంతా బాగానే ఉంది.. మా మధ్యన ఎలాంటి విభేదాలు లేవని చెప్పి రోజు కూడా కాలేదు కానీ.. కొడుక్కి దిమ్మ తిరిగి మైండ్‌బ్లాక్ అయ్యేలా షాకిచ్చారు సమాజ్‌వాదీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్. గడిచిన కొద్దిరోజులుగా ఉత్తరప్రదేశ్ అధికారపక్షంలో అంతర్గత రాజకీయాలు లొల్లి లొల్లిగా మారి.. ఎంత రచ్చ కావాలో అంత రచ్చగా మారిపోయిన పరిస్థితి. కుటుంబంలో వచ్చిన లుకలుకలు పార్టీ మీద ప్రభావం చూపించటమే కాదు.. చివరకు ప్రభుత్వంలో కీలక మార్పులకు కారణంగా మారిన సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్నటి తన బాబాయ్ పై వేటువేసిన యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ నిర్ణయానికి ప్రతిగా సమాజ్ వాదీ చీఫ్.. అఖిలేశ్ తండ్రి ములాయం తాజాగా షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.
అఖిలేశ్ కు అత్యంత సన్నిహితుడు.. మంత్రి తేజ్ నరైన్ పాండేపై ములాయం వేటు వేశారు. ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగించాలని ఆదేశించారు. క్రమశిక్షణారాహిత్యం కారణంగానే ఈ వేటు పడిందన్న విషయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శివపాల్ యాదవ్ వెల్లడించారు.
ఈ మధ్య జరిగిన పార్టీ సమావేశంలో పార్టీ ఎమ్మెల్సీ ఆశు మాలిక్ పై దురుసుగా వ్యవహరించటం.. చేయి చేసుకున్న వైనంపై సీరియస్ అయిన ములాయం.. ఆయన మంత్రి పదవిపై వేటు వేయటమే కాదు.. పార్టీ నుంచి ఆరేళ్లు బహిష్కరిస్తున్నట్లుగా వెల్లడించారు. మరింత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. అఖిలేశ్ సన్నిహితుడిపై వేటు వేసిన ములాయం.. ఆ విషయాన్ని తన కొడుకు మండిపడే శివపాల్ యాదవ్ పేరిట లేఖ ద్వారా సమాచారం అందించారు. ముఖ్యమంత్రి అఖిలేశ్ ఇంటికి వచ్చిన క్రమంలో దాడి చేసి.. బాధ్యతారాహిత్యంతో వ్యవహరించిన ఘటనలో అతడిపై చర్య తీసుకుంటున్నట్లు ప్రకటించారు. తాజా పరిణామం చూస్తే.. నువ్వొకటంటే.. నేను రెండంటా అన్నట్లుగా ఉందని చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/