Begin typing your search above and press return to search.

చినజీయర్ స్వామి.. మీరు కూడా ఇలా వాయించేస్తే ఎలా?

By:  Tupaki Desk   |   14 Jun 2022 4:46 AM GMT
చినజీయర్ స్వామి.. మీరు కూడా ఇలా వాయించేస్తే ఎలా?
X
క్యాలెండర్లో డేట్లు మారుతున్న కొద్దీ.. ధరల పెంపు అన్నది డిఫాల్ట్ అన్నట్లుగా మారిపోయిన పరిస్థితి. అది పెట్రోల్.. డీజిల్ కావొచ్చు.. బియ్యం.. ఉప్పు కావొచ్చు. ప్రజల కోసమే పని చేస్తున్నట్లు చెప్పే ప్రభుత్వాలు సైతం తరచూ ఏదోలా ప్రజల మీద భారం మోపటమే పనిగా పెట్టుకోవటం కనిపిస్తుంటుంది. ఇప్పటికే పెరిగిన ధరలు సరిపోవన్నట్లుగా అవకాశం ఉన్న ప్రతి చోట బాదేసే ప్రభుత్వాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో చినజీయర్ స్వామి వారు కూడా వ్యవహరిస్తున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

హైదరాబాద్ శివారులో.. ఏర్పాటు చేసిన సమతామూర్తి భారీ విగ్రహం.. దానికి అనుబంధంగా ఏర్పాటు చేసిన దేవాలయాల సంగతి తెలిసిందే. సమతామూర్తి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా వచ్చి ఆవిష్కరించటం తెలిసిందే. ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని సందర్శించేందుకు సందర్శకుల నుంచి ఫీజులు వసూలు చేయటం తెలిసిందే.

పెద్దలకు రూ.150.. పిల్లలకు రూ.75 చొప్పున ఛార్జీలను డిసైడ్ చేసి.. భక్తుల నుంచి వసూలు చేస్తుండేవారు. అయితే.. తాజాగా ఈ ఛార్జీలను పెంచేస్తూ నిర్ణయం తీసుకోవటం షాకింగ్ గా మారింది. సమతామూర్తి ప్రాంగణాన్ని ప్రారంభించి.. ఇంకా ఒక కొలిక్కి రాక ముందే... దాని ప్రవేశ ధరల్ని పెంచేస్తూ చినజీయర్ స్వామి అండ్ కో తీసుకున్న నిర్ణయం షాకింగ్ గా మారింది.

ఇకపై పెద్దలకురూ.200.. పిల్లలకు రూ.125 చొప్పున ఎంట్రీ ఫీజును నిర్ణయించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సమతామూర్తి విగ్రహాన్ని.. దాని ప్రాంగణాన్ని సందర్శించేందుకు వీలు ఉంటుంది.

ఒక అధ్యాత్మిక భావన కోసం ఏర్పాటు చేసిన సమతా కేంద్రంలో ఛార్జీలను ఇంత భారీగా పెంచటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్కెట్ లోని వాణిజ్య వస్తువునకు.. దానికున్న డిమాండ్ కు తగ్గట్లు దాని ధరల్ని పెంచేయటం కనిపిస్తుంది.

ఇప్పుడు అదే బాటలో సమతామూర్తి ప్రాంగణం వెళ్లటం జీర్ణించుకోలేనిదిగా మారింది.చూస్తుంటే.. సమతామూర్తి ప్రాజెక్టు మొత్తం కమర్షియల్ అన్న భావన కలగటం ఖాయం. అయినా.. ఈ రేట్లు పెంచటం ఏమిటి చినజీయర్ స్వామిజీ? ప్రభుత్వాల మాదిరి చార్జీల పెంపుతో ఇలా బాదేయటం భావ్యమా?