Begin typing your search above and press return to search.

చంద్రయాన్2పై నోరుపారేసుకున్న ఆర్ ఎస్ ఎస్ మాజీ నేత

By:  Tupaki Desk   |   10 Sept 2019 4:33 PM IST
చంద్రయాన్2పై నోరుపారేసుకున్న ఆర్ ఎస్ ఎస్ మాజీ నేత
X
చంద్రయాన్2 మిషన్.. భారత ఇస్రో శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ ప్రయోగం చివరి నిమిషంలో సిగ్నల్స్ కట్ అయిపోయి సమాచారం అందకుండా పోయింది. ఇప్పటికీ చంద్రయాన్2పై ఆశతో శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని నుంచి సామాన్యుల దాకా అందరూ బాసటగా నిలుస్తున్నారు.

అయితే చంద్రయాన్2 మిషన్ విఫలం అంటూ కొందరు ఆడిపోసుకుంటూనే ఉంటున్నారు. అమెరికా సహా ఇతర దేశాలు చేసిన మూన్ మిషన్ల టాపిక్ లను ఉదహరిస్తూ పోలుస్తున్నారు.

తాజాగా ఆర్ ఎస్ ఎస్ మాజీ కార్యకర్త సంచలనాలు మాట్లాడే శంభాజీ భిఢే అమెరికా మూన్ మిషన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది వరకు ఈయన ఒక తోటలోని మామిడి పండ్లను తింటే మగపిల్లలు పుడుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. ఆ కోవలోనే తాజాగా అమెరికా మూన్ మిషన్ ను చూపిస్తూ చంద్రయాన్2 పై ఆడిపోసుకోవడం కలకలం రేపింది.

మహారాష్ట్రలోని షోలాపూర్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన శంభాజీ భిఢే అమెరికా మూన్ మిషన్ 39 సార్లు చేసినా విజయవంతం కాలేదని.. ఆ తరువాత అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు భారత శాస్త్రాన్ని అనుసరించి ప్రయోగించి విజయవంతం చేశారని భిఢే నోరుజారారు. అమెరికా తన 39వ మిషన్ ప్రయోగాన్ని ఏకాదశి తిథి రోజున నిర్వహించి విజయం సాధించారంటూ చంద్రయాన్2 విఫలం కావడానికి గ్రహ - తిథుల ప్రభావమే అని ఆడిపోసుకున్నారు. ఇప్పుడు భిఢే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అందరూ ఆయనపై మండిపడుతున్నారు.