Begin typing your search above and press return to search.

బీహార్‌ లో అస‌లు భ‌యం ఇదే

By:  Tupaki Desk   |   21 Nov 2015 4:45 PM GMT
బీహార్‌ లో అస‌లు భ‌యం ఇదే
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూట‌మిని కాద‌ని నితీశ్ కుమార్ నాయ‌క‌త్వంలోని మ‌హాకూట‌మికి ఓటువేసిన బీహార్ ప్ర‌జానికం ఏం కోరుకుంటోంది? ఏం వ‌ద్ద‌నుకుంటోంది? అభివృద్ధి చిత్రంపై ఎక్క‌డో ఉన్న బీహారీల రాష్ర్టాన్ని బీహారీ పాల‌కుడు - బీహారీ భూముపుత్రుడు అయిన నితీశ్ ఏ విధంగా మార్చ‌నున్నారు? ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు అడ్డువ‌చ్చేది ఏంటి? ఇన్నాళ్లు లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ప్రసాద్ యాద‌వ్‌ ను వ‌ద్ద‌నుకున్న బీహారీలు ఇపుడు ఆయ‌నకు ఓటువేయ‌డ‌మే కాకుండా... లాలూ కుమారులిద్ద‌రు మంత్రులుగా ఉండ‌టంపై ఎలా ఫీల‌వుతున్నారు? ఈ ప్ర‌శ్న‌లు ఇపుడు ఆస‌క్తిక‌రంగా మారాయి. వీటికి బీహార్‌ లో ఓట‌మిపాల‌యిన బీజేపీ ఆస‌క్తిక‌రమైన స‌మాధానం ఇస్తోంది.

బీహార్ లో సన్ రైజ్ (పుత్రుల ఎదుగుదల) కోసం పాలనను ప‌ణంగా పెట్టవద్దని బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్ర‌తిప‌క్ష బీజేపీ సూచించింది. నితీశ్ మంత్రివర్గంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారులిద్దరికీ కీలక పదవులు ఇవ్వడంపై బీజేపీ సీనియర్ నాయకుడు సంబిత్ పత్రా స్పందించారు. లాలూ ప్ర‌సాద్‌ యాద‌వ్‌ కుమారుల ఎదుగుదల కోసం (సన్ రైజ్) రాష్ట్రంలో పాలనకు సూర్యాస్తమయం (సన్ సెట్) అయ్యేలా చేయవద్దని అన్నారు. లాలూ కుమారులిద్దరికీ పాలనలో ఎటువంటి అనుభవం లేకపోయినా....కేవలం లాలూ కుమారులన్న కారణంతో కీలకమైన పదవులను అప్పగించడాన్ని సంబిత్ పత్రా తప్పుపట్టారు. లాలూ వారసత్వ రాజకీయాలకు ఇంత కంటే మరో తార్కాణం అవసరం లేదని మండిప‌డ్డారు. లాలూ పార్టీపై న‌మ్మ‌కం ఉంచుకోకుండా తన కుటుంబంపైనే విశ్వాసం ఉంచారని సంబత్ పత్రా విమర్శించారు.

బీహార్‌లో నితీశ్ విజ‌యం, బీజేపీ ఓట‌మి నేప‌థ్యంలో తాము నిర్మాణాత్మ‌క ప్ర‌తిప‌క్ష పాత్ర పోషించాల్సి ఉంద‌ని ప‌త్రా తెలిపారు. బీహార్ అభివృద్ధి కోసం ఏ రాష్ర్టానికి ఇవ్వ‌ని విధంగా 1.65వేల కోట్ల రూపాయ‌ల‌ను ప్ర‌ధాన‌మంత్రి మోడీ కేటాయించార‌ని...ఈ నేప‌థ్యంలో ఆ రాష్ర్టం అభివృద్ధి కోసం త‌మ‌వంతుగా ఈ స‌ల‌హాలు ఇస్తున్నామ‌ని ప‌త్రా చెప్పారు. నితీశ్ పాల‌న‌పై త‌మ స్పంద‌న‌ను ఎప్పటిక‌పుడు తెలియ‌జేస్తుంటామ‌ని ప‌త్రా వివ‌రించారు.