Begin typing your search above and press return to search.

భారత్ ను కాకుండా పాక్ ను పొగిడిన కాంగ్రెస్

By:  Tupaki Desk   |   1 March 2019 11:36 AM GMT
భారత్ ను కాకుండా పాక్ ను పొగిడిన కాంగ్రెస్
X
భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే ఈ వ్యవహారంలో ప్రపంచమంతా భారత్ కు అనుకూలంగా ఉంది. కానీ దేశంలోని కాంగ్రెస్ పార్టీ మాత్రం పక్క దేశ ప్రధానిని కొనియాడడం దుమారం రేపుతోంది. దీనిపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిట్ పాత్ర నిప్పులు చెరిగారు.

కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సినీ నటి ఖుష్బూ ‘మన ప్రధాని ఇమ్రాన్ ను చూసి నేర్చుకోవాలి’ అంటూ చేసిన ట్వీట్ సంచలనమైంది. ఈ ట్వీట్ ను రీట్వీట్స్ చేస్తూ బీజేపీ అధికార ప్రతినిధి సంబిట్ పాత్ర ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఉద్రికత్తలు ఇంత స్థాయిలో ఉన్నా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పాక్ జెండాను, ప్రధానిని ప్రమోట్ చేయడంలో ఎంత బిజీగా ఉందో అర్థం చేసుకోవాలని బీజేపీ మండిపడింది. పాక్ చెరలో చిక్కిన భారత పైలెట్ అభినందన్ రాక కోసం భారత మొత్తం ఎదురుచూస్తుండగా.. కొందరు కాంగ్రెస్ నేతలు మాత్రం ఇమ్రాన్ ఖాన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని కొనియాడడాన్ని తప్పుపట్టారు.

పాక్ విమానాలను ఎదురించి వాటిని కూల్చివేసిన భారత పైలెట్ అభినందన్ పాక్ లో తన విమానంతో కూలిపోయాడు. అనంతరం పాకిస్తాన్ ఆర్మీకి చిక్కాడు. జెనీవా ఒప్పందం ప్రకారం భారత్ సహా ప్రపంచ దేశాలు ఒత్తిడి చేయడంతో తలొగ్గిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శాంతిస్థాపనలో భాగంగా భారత్ పైలెట్ అభినందన్ ను వదిలేస్తున్నట్టు ప్రకటించింది. దీనిపై ఖుష్బూ పాక్ ప్రధానిని పొగుడుతూ ట్వీట్ చేయడం దుమారం రేపింది.