Begin typing your search above and press return to search.
ఒకే ప్రేమ కేసు.. రెండు విరుద్ధమైన తీర్పులు!
By: Tupaki Desk | 21 May 2021 4:09 AM GMTతాము ప్రేమించుకున్నామని, తమ కుటుంబ పెద్దల నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని మూడు జంటలు పంజాబ్-హర్యానా హైకోర్టును ఆశ్రయించాయి. పోలీసుల నుంచి సరైన రక్షణ లేదని.. న్యాయస్థానమే తమను ఆదుకోవాలని కోరాయి. ఈ మూడు కేసులను మూడు బెంచ్ లు విచారించాయి. ఇందులో మొదటి రెండు బెంచ్ లు ఒకవిధంగా తీర్పు చెప్పగా.. మరో బెంచ్ పూర్తి భిన్నమైన తీర్పు వెలువరించింది. దీంతో.. ఈ అంశం ఇప్పుడు చర్చనీయంగా మారింది.
మొదటి కేసులో ‘ఇలాంటి సంబంధాలు సామాజికంగా, నైతికంగా ఆమోదయోగ్యం కాదు. అందువల్ల పిటిషనర్లు కోరుతున్నట్టు రక్షణ కోసం ఆదేశాలు ఇవ్వలేం’’ అని చెప్పింది. మరో కేసులో కూడా ఇలాంటి తీర్పునే వెలువరించింది. ‘ఇలాంటి వారికి రక్షణ కల్పిస్తే.. మొత్తం సమాజ నిర్మాణమే చెదిరిపోతుంది’’ అని వ్యాఖ్యానించింది. కాగా.. మరో కేసులో మరో బెంచ్ మాత్రం పూర్తిభిన్నమైన తీర్పు చెప్పింది.
పెళ్లీడుకు వచ్చినవారు తమకు నచ్చిన భాగస్వామిని ఎంచుకొని, పరస్పర అంగీకారంతో కలిసి ఉండొచ్చని స్పష్టం చేసింది. అది పెళ్లి చేసుకోవడం ద్వారానా.. మరో విధంగానా అన్నది పూర్తిగా వారి ఇష్టమని తేల్చి చెప్పింది. పౌరులుగా ఇది వారి ప్రాథమిక హక్కు అని విస్పష్ట తీర్పు వెలువరించింది.
కాగా.. సుప్రీం కోర్టు కూడా మూడేళ్ల క్రితం ఇదే తరహా తీర్పును వెలువరించడం గమనించాల్సిన అంశం. సహజీవనం అనేది వ్యక్తుల ఇష్టమని.. వ్యక్తి స్వేచ్ఛ, ప్రతిష్టల్లో ఎంపిక చేసుకోవడం అన్నది విడదీయలేని అంశమని చెప్పింది. అటు రాజ్యాంగంలో కూడా స్పష్టంగా పేర్కొనబడింది. కుల, మత, జాతి, లింగ, ప్రాంతీయ వివక్ష లేని సమాజం ఏర్పడాలని రాజ్యాంగం కోరుకుంది. కానీ.. న్యాయస్థానాలు ఇందుకు భిన్నంగా తీర్పు వెలువరించడం ఆశ్చర్యానికి, ఆందోళనకు గురిచేస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.