Begin typing your search above and press return to search.
మళ్లీ అదే సెంటిమెంటు.. కేసీఆర్ బంగారు తెలంగాణ కామెంట్లు
By: Tupaki Desk | 26 Aug 2022 3:30 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి మళ్లీ అదే సెంటిమెంటును తెరమీదికి తెచ్చారు. బంగారు పంటలు పండే తెలంగాణ కావాలా, మత పిచ్చితో మంటలు రేగే తెలంగాణ కావాలా, ప్రజలే తేల్చుకోమన్నారు. కొంగర కలాన్‌లో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనం, జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సంద ర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం పాల్గొన్నారు. కొంగర్‌కలాన్‌లో 44 ఎకరాల్లో ఆధునిక సదుపాయలతో రూ.58 కోట్లతో కొత్త కలెక్టరేట్ను నిర్మించారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో తప్పుడు ప్రచారం చేశారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు పడిపోతాయని అన్నారని గుర్తు చేశారు. విద్యుత్, సాగునీరు, తాగునీరు ఇవ్వని వాళ్లే తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు. 15 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామని వెల్లడించారు. ఏ ప్రాంతంలో మేధావులు, విద్యాధికులు, యువత ఏమరపాటుగా ఉంటారో అక్కడ చాలా బాధలు అనుభవించాల్సి వస్తుందని వివరించారు.
చిన్న ఏమరపాటు వల్ల 58 ఏళ్లు తెలంగాణ కోసం పోరాటం చేయాల్సి వచ్చిందని ఉద్ఘాటించారు. రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు ఎక్కడా లేవని స్పష్టం చేశారు.
దేశంలోని ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వ్యాఖ్యానించారు. రైతులు పండించే ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మరోసారి చెప్పారు. రైతులు అప్పులు తీసుకునే అవసరం లేకుండా రైతు బంధు ఎకరానికి రూ.10 వేలు అందిస్తున్నామన్నారు.
``తెలంగాణ కోసం ఉద్యమం జరిగే సమయంలో రంగారెడ్డి జిల్లాలో అనేక రకాల తప్పుడు ప్రచారాలు చేశారు. భూములు ధరలు పడిపోతాయని, రాష్ట్రం వస్తే లాభం ఉండదని చెప్పారు. మనకు కరెంట్, మంచినీరు ఇవ్వని వారు మనల్ని గోల్ మాల్ చేసే ప్రయత్నం చేశారు.
పట్టుదలతో 14 ఏళ్లు పోరాడితే చాలా త్యాగాల తర్వాత రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కొత్త జిల్లాలను సాధించుకున్నాం. చిన్న ఏమరపాటు వల్ల 58 ఏళ్లు తెలంగాణ కోసం పోరాటం చేయాల్సి వచ్చింది.`` అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మొత్తానికి మునుగోడు ఎన్నికల పర్వంలో మరోసారి.. సెంటిమెంటుకే కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.