Begin typing your search above and press return to search.

స్వలింగ పెళ్లిళ్లు అధికారికమన్న దేశాలెన్నో..!

By:  Tupaki Desk   |   28 Jun 2015 4:29 AM GMT
స్వలింగ పెళ్లిళ్లు అధికారికమన్న దేశాలెన్నో..!
X
తాజాగా అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకంపనలు సృష్టిస్తోంది. స్వలింగ సంపర్కులు వివాహం చేసుకునేందుకు అధికారికంగా అనుమతి ఇవ్వటంపై అమెరికా సమాజంలో తీవ్ర చర్చ సాగుతోంది. మగాడ్ని.. మగాడు.. ఆడోళ్లను ఆడోళ్లే పెళ్లి చేసుకునే విధానాన్ని తాజా తీర్పు ప్రోత్సహిస్తుందని.. అదే జరిగితే సమాజంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆధునిక ప్రపంచానికి కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పుకునే అమెరికాలో స్వలింగ సంపర్కుల వివాహానాన్ని అధికారికంగా ఇప్పుడు ప్రకటించారు కానీ.. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు.. ఇలాంటి గే మ్యారేజ్‌లను ఎప్పుడో అధికారికం చేయటం గమనార్హం.

స్వలింగ సంపర్కులు వివాహం చేసుకునేందుకు వీలు కల్పించిన అమెరికా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో.. పలు దేశాల్లో ఇలాంటి వివాహాల్ని చట్టబద్ధం చేసిన తీరు చూస్తే.. ఆశ్చర్యం కలగటం ఖాయం. ద నెదర్లాండ్స్‌ దేశంలో అయితే.. ఇలాంటి వివాహాన్ని చట్టబద్ధం చేస్తూ 2000లోనే నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారంపై అమెరికా ఇప్పుడు నిర్ణయం తీసుకోవటమే పెద్ద చర్చ నడుస్తుండే.. నెదర్లాండ్‌ దేశంలో పదిహేనేళ్ల క్రితమే ఇలాంటి వివాహాల్ని అధికారికం చేయటం గమనార్హం.

స్వలింగ సంపర్కులు వివాహం చేసుకోవటం ఎంతమాత్రం తప్పు కాదని.. దాన్ని అధికారికం చేసిన దేశాల జాబితా చూస్తే.

I ద నెదర్లాండ్‌ 2000

I బెల్జియం 2003

I కెనడా 2005

I స్పెయిన్‌ 2005

I దక్షిణాఫ్రికా 2006

I నార్వే 2009

I స్వీడన్‌ 2009

I మెక్సికో 2009 (కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అధికారికం)

I ఐర్లాండ్‌ 2010

I పోర్చుగల్‌ 2010

I అర్జంటీనా 2010

I డెన్మార్క్‌ 2012

I ఉరుగ్వే 2013

I న్యూజిలాండ్‌ 2013

I ఫ్రాన్స్‌ 2013

I బ్రెజిల్‌ 2013

I వేల్స్‌ 2013

I ఇంగ్లాండ్‌ 2013

I స్కాట్‌లాండ్‌ 2104 (ఇంగ్లండ్‌లో భాగమైనప్పటికీ వేల్స్‌.. ఇంగ్లాండ్‌లో 2013లో అధికారికం చేస్తే.. స్కాట్లాండ్‌లో 2014లో చేశారు)

I లగ్జంబర్గ్‌ 2014

I ఫిన్లాండ్‌ 2015

I ఐస్‌లాండ్‌ 2015

I యూనైటెడ్‌ స్టేట్స్‌ 2015