Begin typing your search above and press return to search.

అదే విజ‌న్‌.. మోడీకి చెప్పిన చంద్ర‌బాబు!

By:  Tupaki Desk   |   6 Dec 2022 6:30 AM GMT
అదే విజ‌న్‌.. మోడీకి చెప్పిన చంద్ర‌బాబు!
X
ఎన్నికల్లో గెలిచామా? ఓడామా..? అనే విష‌యాల‌ను ప‌క్క‌న పెడితే.. టీడీపీ అదినేత చంద్ర‌బాబు విజ‌న్ మాత్రం స‌జీవం. ఆయ‌న ఎక్క‌డున్నా.. ఏం చేసినా.. విజ‌న్ కే చంద్ర‌బాబు ప్రాదాన్యం ఇస్తున్నారు. ఇస్తారు. తాజాగా కూడా అదే జ‌రిగింది.

ప్రధాని న‌రేంద్ర మోడీ నేతృత్వంలో డిల్లీలో జ‌రిగిన జీ-20 అఖిలపక్ష సమావేశానికి టీడీపీ అధినేత చంద్ర‌బాబు సైతం హాజ‌ర‌య్యారు. ఈ స‌ద‌స్సుకు.. దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి నాయ‌కులు వ‌చ్చారు. ఒక్క తెలంగాణ తప్ప‌!

అయితే, అంద‌రిలో ఎంద‌రు స‌ల‌హాలు సూచ‌న‌లు ఇచ్చారో తెలియదుకానీ.. చంద్ర‌బాబు మాత్రం త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాన్ని దేశ వేదిక‌పై స‌ద్వినియోగం చేసుకున్నారు. జీ-20 సమావేశంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పలు సూచనలు చేశారు.


డిజిటల్ నాలెడ్జ్ అంశంపై చంద్రబాబు మాట్లాడారు. దేశ ప్రగతిపై వచ్చే 25 ఏళ్లకు విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేయాలని చంద్రబాబు అన్నారు. వచ్చే 25 ఏళ్లలో భారత్ మొదటి లేదా రెండోస్థానానికి చేరనుందని సమావేశంలో వివరించారు.

దేశానికి ఉన్న ప్రధాన బలం యువశక్తి అని చెప్పిన చంద్రబాబు.. వారికి అవకాశాలు సృష్టించేలా పాలసీల రూపకల్పన జరగాలన్నారు. మానవ వనరులు, నాలెడ్జ్ ఎకానమీ అనుసంధానంతో అద్భుత ఫలితాలు వస్తాయన్నారు.

అనంతరం జరిగిన సమావేశాల్లో ప్రధాని మోడీ.. తెలుగుదేశం అధినేత సూచించిన డిజిటల్ నాలెడ్జ్ అంశాన్ని సమావేశంలో ప్రస్తావించారు. భేటీ తర్వాత ప్రధాని మోడీ.. తెలుగుదేశం అధినేత చంద్రబాబును పలకరించారు. సో.. ఎక్క‌డ ఉన్నా.. క‌ర్పూర‌పు వాస‌న‌ను ఎవ‌రూ క‌ప్పిపుచ్చ‌లేర‌న్న‌ట్టుగా.. చంద్ర‌బాబు విజ‌న్ కూడా అలానే ఉంద‌ని అంటున్నారు పరిశీల‌కులు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.