Begin typing your search above and press return to search.
అరిగిపోయిన గ్రాంఫోన్ రికార్డు మాదిరి.. ఇదే మాటా బాబు?
By: Tupaki Desk | 27 May 2021 9:30 AM GMTవిశ్వాసమో.. అతి విశ్వాసమో కానీ.. టీడీపీ అధినేత చంద్రబాబునోటి నుంచి అదే పనిగా తర్వాత వచ్చే ఎన్నికల్లో తమ విజయం ఖాయమన్నట్లుగా మాట్లాడతారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయనకంటూ ఆ మాత్రం నమ్మకం ఉండటం తప్పేం కాదు. కానీ.. అధికారంలో ఉన్న ప్రభుత్వం గురించి ప్రభుత్వాధినేత గురించి వ్యాఖ్యలు చేసేటప్పుడు.. విరుచుకుపడే వేళలో సమయం.. సందర్భంతో పాటు.. జనాల మూడ్ ను కూడా గుర్తించాల్సిన అవసరం ఉందన్న చిన్న లాజిక్ ను ఆయన తరచూ మిస్ అవుతుంటారు.
జగన్ ప్రభుత్వం కొలువు తీరిన నాటి నుంచి టీడీపీ నేతల్ని.. కార్యకర్తల్ని.. సానుభూతిపరుల్ని తెగ తొక్కేస్తున్నారన్నది బాబు వేదన.. అంతకు మించిన ఆవేదన. ఇదే విషయాన్ని వైసీపీ నేతల వద్ద ప్రస్తావిస్తే క్షణం ఆలస్యం చేయకుండా.. బాబు హయాంలో చేసిందేమిటో? మేం అనుభవించలేదా? వారితో పోలిస్తే మేమే చాలా బెటర్ అంటూ వ్యాఖ్యలు చేస్తారు. ఒకవేళ.. చంద్రబాబు చెప్పినట్లుగా ఏపీ ప్రజలు కూడా ఆయన మాదిరి అనుకుంటున్నారా? అంటే అదేమీ లేదన్న మాట బలంగా వినిపీస్తూ ఉంటుంది. అదెలా చెబుతారంటే.. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని చెబుతారు.
అంతేకాదు.. కరోనా వేళలో చోటు చేసుకున్న పరిణామాలతో అధికారంలో ఉన్న వారు ఎవరైనా సరే.. విమర్శలు వెల్లువెత్తుతాయని.. కానీ..రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదన్న మాట వైసీపీ నేతల నోటి నుంచి వినిపించటమేకాదు.. తమ ప్రభుత్వం పని చేయకపోతే.. ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కదా? అన్న ప్రశ్నను వారు సంధిస్తుంటారు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చే వరకు బాబు వెయిట్ చేయకుండా.. ఆయన చేసే వ్యాఖ్యలతో జగన్ మీద మరింత సానుభూతి పెరుగుతుందన్న వాదన కూడా వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. తమపై సాధింపు చర్యలు చేపడుతున్నారని.. అందుకు పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటిని బాబు విమర్శిస్తూనే ఉన్నారు. ఆయన మాటలు కొత్తగా కాకుండా.. విని విని విసుగు పుట్టే పరిస్థితి నెలకొందన్న మాట వినిపిస్తోంది. తాజాగా తన మాటల్ని మరింత ఘాటుగా మార్చి చేసిన హెచ్చరిక ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. తాము ఏం చేసినా ఏమీ కాదులే అన్న భ్రమతో వైసీపీ నేతలు.. కొందరు అధికారులు ఉన్నారని బాబు మండిపడుతున్నారు.
సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని.. గడియారం ముల్లు తిరిగి మళ్లీ వస్తుందని.. టీడీపీకి ఒక రోజు వస్తుందని.. ఆ రోజు తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని ఆయన చేస్తున్న వార్నింగ్ టైమింగ్ ఏ మాత్రం బాగోలేదంటున్నారు. ముఠా తగాదాలకు.. గొడవలకు దూరంగా ఉండే బీసీ జనార్దన్ రెడ్డి లాంటి నేతపై కేసులు పెట్టి కొడుతున్నారని బాబు మండిపడ్డారు. తమ నేతలపై కొట్టిన పోలీసులపై తిరిగి కేసులు పెట్టి జైలుకు పంపుతామని.. తప్పు చేసిన ఏ ఒక్క పోలీసును వదిలపెట్టమన్నారు.
జనార్దన్ రెడ్డి విషయంలో పార్టీ పరంగా ప్రైవేటు కేసు వేస్తామని.. జగన్ ను నమ్మకున్న వారంతా ఇప్పుడు కోర్టు చుట్టూ తిరుగుతున్నారని.. తప్పు చేసిన పోలీసులు కూడా జైలుకు వెళ్లే పరిస్థితి ఉంటుందని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఇప్పటికే రెండేళ్లు గడిచిపోయాయని.. కళ్లు మూసుకుంటే మరో మూడేళ్లు గడిచిపోతాయని.. తర్వాత మీ వెంట ఎవరుంటారో నేనూ చూస్తానంటూ బాబు చేస్తున్న వార్నింగ్ సరి కాదంటున్నారు.
పోలీసులు తప్పు చేస్తే.. అదే పనిగా మాట్లాడే కంటే.. న్యాయపరంగా సవాలు చేయాలి. అంతే తప్పించి ఇలా మాటలతో విషయాన్ని మరింత ముదిరేలా చేయటం మంచిది కాదన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. తాను ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితిని డీల్ చేయలేక.. బాబు ఫస్ట్రేషన్ అంతకంతకూ ఎక్కువ అవుతోందన్న మాట వినిపిస్తోంది. జగన్ పాలనా తీరును తప్పు పడుతున్న చంద్రబాబు.. తాను అధికారంలోకి వస్తే అదే చేస్తానని చెప్పటం ఆయన అనుభవానికి చిన్నతనం కాదా?