Begin typing your search above and press return to search.

ఏపీకి కొత్త సీఎస్‌గా సమీర్‌ శర్మ

By:  Tupaki Desk   |   10 Sep 2021 6:44 AM GMT
ఏపీకి కొత్త సీఎస్‌గా సమీర్‌ శర్మ
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సమీర్ శర్మను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం రోజు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ పదవిలో కొనసాగుతున్నారు. ఈ నెల 30వ తేదీ న ఆదిత్యనాథ్ దాస్ రిటైర్ కానున్నారు. ప్రస్తుతం ప్లానింగ్ అండ్ రిసోర్స్ మొబలైజేషన్ స్పెషల్ సీఎస్‌ గా విధులు నిర్వహిస్తున్నారు సమీర్ శర్మ. ఆదిత్యనాథ్ దాస్‌ పదవీ విరమణ విషయం తెరపైకి వచ్చినప్పటి నుంచి పలువురు పేర్లను పరిశీలించిన ప్రభుత్వం, చివరకు సమీర్‌ శర్మ నియమానికి మొగ్గు చూపింది

ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఆదిత్యనాథ్ దాస్ కి మూడు మాసాల పాటు ఎక్స్‌ టెన్షన్ ఇచ్చింది. మళ్లీ ఆదిత్యనాధ్ దాస్ సర్వీసు పొడిగింపునకు ఏపీ ప్రభుత్వం సుముఖంగా లేదు. దీంతో కొత్త రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంపికకే జగన్ సర్కార్ మొగ్గుచూపింది. ఏపీ ప్రభుత్వ ప్రణాళిక విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా సమీర్ శర్మ కొనసాగుతున్నారు.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో సమీర్ శర్మ ఆప్కో ఎండీగా పనిచేశారు. 1985 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ స‌మీర్ శ‌ర్మ‌ అక్టోబ‌ర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ సీఎస్‌ గా స‌మీర్ శ‌ర్మ బాధ్య‌త‌లు చేప‌ట్టనున్నారు. కొనేళ్లుగా కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతున్న ఆయన కేంద్రంలోని ఇండియన్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్పొరేట్‌ ఎఫైర్స్‌ డైరెక్టర్‌ జనరల్‌గా విధులు నిర్వహించారు.

ప్రస్తుత సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌(1987 బ్యాచ్‌) సమీర్‌ శర్మ కంటే రెండేళ్లు జూనియర్‌. ఆదిత్యనాథ్‌ దాస్‌ ఈ నెల 30న రిటైర్ అవుతున్నారు. ఆయన సర్వీసును మరో మూడు నెలలు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం జూన్ లో కేంద్రానికి లేఖ రాసింది. అయితే దాస్ సీఎస్‌ గా కొనసాగడం ఇష్టం లేని ఒక కీలక అధికారి కొనసాగింపు ప్రతిపాదనను ఆలస్యం చేయించారన్న విమర్శలున్నాయి. అయితే దాస్‌కు పొడిగింపు ఇస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. మరోవైపు ఏపీ ప్రభుత్వం అభ్యర్థన మేరకే సమీర్‌ శర్మను రాష్ట్రానికి పంపుతున్నట్లు కేంద్ర నియామకాల కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. పొడిగింపు తర్వాత ఆదిత్యనాథ్ దాస్‌ సెప్టెంబరు నాటికి పదవీ విరమణ చేయబోతున్నారు. అయన స్థానంలో సమీర్ శర్మప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా భాద్యతలు స్వీకరించనున్నారు.