Begin typing your search above and press return to search.
ఏపీకి రానున్న సమీర్ శర్మ.. కొత్త సీఎస్ గా నియమించే అవకాశం !
By: Tupaki Desk | 26 Jun 2021 10:30 AM GMTసీనియర్ ఐఏఎస్ అధికారి సమీర్ శర్మ ఏపీ రాష్ట్ర కేడర్ కు మళ్లీ తిరిగి రానున్నారు. గత కొన్ని ఏళ్లుగా కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతున్న ఆయన ప్రస్తుతం కేంద్రంలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ ఎఫైర్స్ డైరెక్టర్ జనరల్ గా భాద్యతలు నిర్వహిస్తున్నారు. అయితే కేంద్ర సర్వీసుల్లో అంత పెద్ద పోస్టులో ఉన్న సమీర్ శర్మ అకస్మాత్తుగా గా రాష్ట్ర కేడర్‌కు రావడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 1985 బ్యాచ్ కు చెందిన సమీర్ శర్మను తదుపరి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)ని చేస్తారని అధికార వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ (1987 బ్యాచ్) సమీర్ శర్మ కంటే రెండేళ్లు జూనియర్. ఆదిత్యనాథ్ దాస్ ఈ నెల 30న రిటైర్ అవ్వనున్నారు. ఆయన సర్వీసును మరో మూడు నెలలు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కేంద్రానికి లేఖ రాసింది. అయితే దాస్ సీఎస్ గా కొనసాగడం ఇష్టం లేని ఒక కీలక అధికారి కొనసాగింపు ప్రతిపాదనను ఆలస్యం చేయించారన్న విమర్శలున్నాయి. అయితే దాస్ కు పొడిగింపు ఇస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. మరోవైపు ఏపీ ప్రభుత్వం అభ్యర్థన మేరకే సమీర్ శర్మను రాష్ట్రానికి పంపుతున్నట్లు కేంద్ర నియామకాల కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. పొడిగింపు తర్వాత ఆదిత్యనాథ్ దాస్ సెప్టెంబరు నాటికి పదవీ విరమణ చేస్తారు. ఆ తర్వాత ఆయనకు సీఎస్ పదవి ఇచ్చినా మరో రెండు , మూడు నెలల్లో అంటే నవంబరు నెలాఖరు నాటికి ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఆ మాత్రం దానికే సమీర్ శర్మ కేంద్రంలో పెద్ద పోస్టు వదులుకుని ఎందుకు వస్తున్నారో తెలియడం లేదని సీనియర్ అధికారులు చర్చించుకుంటున్నారు. అయితే ఆయన్న ప్రస్తుతానికి బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్‌గా నియమించి.. మూడు నెలల తర్వాత సీఎస్‌గా నియమించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మరో రెండు నెలల్లో ఆయన రిటైర్ కావలసి ఉన్నందున.. మళ్లీ కేంద్రానికి లేఖ రాసి కొనసాగింపు ఇప్పించే అవకాశం ఉండొచ్చని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.