Begin typing your search above and press return to search.

తనను అరెస్ట్ చేయవద్దు.. సమీర్ వాంఖడే పిటీషన్

By:  Tupaki Desk   |   28 Oct 2021 2:30 PM GMT
తనను అరెస్ట్ చేయవద్దు.. సమీర్ వాంఖడే పిటీషన్
X
ఎన్సీబీ ముంబై జోనల్ ఆఫీసర్ సమీర్ వాంఖడే చిక్కుల్లో పడ్డారు. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసి బెయిల్ రాకుండా ఇన్నాళ్లు ఆపేసిన ఈ స్టిక్ట్ ఆఫీసర్ పై తాజాగా 25 కోట్ల లంచం ఆరోపణలువచ్చాయి. ఈ కేసులో ప్రధాన సాక్షి సమీర్ వాంఖడే రూ.25 కోట్లు డిమాండ్ చేశాడని అఫిడవిట్ దాఖలు చేయడం సంచలనమైంది.  ఈ క్రమంలోనే సమీర్ వాంఖడేకు అరెస్ట్ భయం పట్టుకుంది.

ఈ క్రమంలోనే తనపై వచ్చిన ఆరోపణలపై మహారాష్ట్ర పోలీసుల విచారణ నేపథ్యంలో తన అరెస్ట్ ను ఆపడానికి సమీర్ వాంఖడే కోర్టును ఆశ్రయించారు. తనను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేయకుండా నిరోధించాలని కోరుతూ కోర్టులో పిటీషన్ వేశారు. అయితే ఆ పిటీషన్ తిరస్కరణకు గురైంది.

ఇక సమీర్ వాంఖడేకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ హామీ ఇచ్చారు. మీ అరెస్ట్ కు ముందు పోలీసులు కనీసం 72 గంటల ముందు నోటీసులు జారీ చేస్తారని కోర్టుకు తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ మేరకు చెప్పడంతో వాంఖడే పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలోనే అరెస్ట్ ను నిరోధిస్తూ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు.

మరోవైపు తనపై వస్తున్న ఆరోపణలపై మహారాష్ట్ర పోలీసులు విచారణను వాంఖడే వద్దంటున్నారు. సీబీఐ అధికారులే తనను విచారించాలని కోరుతున్నాడు. ఈ మేరకు కోర్టుకు విన్నవించాడు.

ఇక ఒక ప్రభుత్వాధికారి ఒక రాష్ట్ర పోలీసులను నమ్మకపోవడం ఇప్పుడు సంచలనమైంది. మహారాష్ట్ర సర్కార్ తో సమీర్ వాంఖడే వైరమే ఇందుకు కారణం. ముంబైలో డ్రగ్స్ మాఫియాను ఏరివేస్తూ ముంబైని డ్రగ్స్ కు అండగా మార్చేశారని సమీర్ వాంఖడేపై మహారాష్ట్రలోని శివసేన సర్కార్ గుర్రుగా ఉంది.  ఈ క్రమంలోనే ప్రతీకారంతో ఈకేసులు పెట్టారని సమీర్ వాదిస్తున్నారు.

ఈ క్రమంలోనే మహారాష్ట్ర సర్కార్ తనను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని.. సీబీఐ తనపై విచారించాలని సమీర్ వాంఖడే కోరుతుండడం హాట్ టాపిక్ గా మారింది. ఒక ప్రభుత్వాధికారి  ఈ వాదన తీసుకురావడం సంచలనమైంది.