Begin typing your search above and press return to search.

ఇంత జనమేంటి సామీ...వణుకు పుట్టించేలా...?

By:  Tupaki Desk   |   3 Feb 2022 7:53 AM GMT
ఇంత జనమేంటి సామీ...వణుకు పుట్టించేలా...?
X
అవును. వారితో పెట్టుకుంటే ఏంటో రుచి చూపించారు. బలప్రయోగంతో ఉద్యమాన్ని ఆపడం ఎవరి తరం కాదని మరో మారు ప్రభుత్వ ఉద్యోగులు నిరూపించారు. వేలాది ఉద్యోగులు విజయవాడను చుట్టుముట్టేశారు. కోవిడ్ ఆంక్షలు అన్నారు, మరోటి చెప్పారు, నిర్భందం అన్నారు, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు సెలవులు రద్దు అని కూడా అన్నారు. అయినా కూడా చలో విజయవాడ కార్యక్రమం సూపర్ సక్సెస్ అయింది.

దీంతో సర్కార్ పెద్దలు విస్తుబోవాల్సి వచ్చిందని అంటున్నారు. చలో విజయవాడ పేరిట ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చిన పిలుపు బంపర్ హిట్ కావడంతో వైసీపీ పెద్దలు ఆలోచనలలో పడిపోయారుట. ఇంత జనమేంటి స్వామీ అని వారు మధనం చెందుతున్నారుట.

దీనికంతటికీ కారణం పోలీసుల వైఫల్యమే అని కూడా ప్రభుత్వం అభిప్రాయపడుతోందని సమాచారం. వేలాదిగా పదమూడు జిల్లాల నుంచి జనాలు తరలివస్తూంటే ఇంటలిజెన్స్ నివేదికలు ఏమైపోయాయి అన్నది కూడా ప్రభుత్వం సీరియస్ అవుతోందిట.

అయితే ఇక్కడ ఒక విషయం కూడా ఉందిట. ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన‌లకు లోపాయికారిగా పోలీసులు సహకారమే కారణమని కూడా భావిస్తున్నారుట. మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగులు తాము చెప్పిన టైమ్ కి చెప్పిన చోటకు వేలాదిగా వచ్చేసి సర్కార్ పెద్దలకు కలవరం కలిగించారు అని అంటున్నారు.

జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఇంత పెద్ద ఎత్తున నిరసన జరగడం ఇదే ప్రధమం అని కూడా చెబుతున్నారు. మొత్తానికి ప్రభుత్వం ఒకటి తలచింది, ఉద్యోగులకు సెలవులు లేకుండా కట్టడి చేయాలనుకుంది. కానీ ఇలా రావడంతో ఇక శాఖాపరమైన యాక్షన్ కి దిగాలని చూస్తోందిట. అయితే వేలాదిగా ఉద్యోగులు వస్తే వారి మీద ఎలాంటి లాఠీ విరగకుండా శాంతియుతంగా ఆందోళన ముగించేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోందిట. ఒకవేళ అనుకోని ఘటనలు కనుక చోటు చేసుకుంటే మాత్రం ప్రభుత్వం అతి పెద్ద ఇబ్బందిలో పడిపోతుంది.

ఇక చలో విజయవాడకు పెద్ద ఎత్తున జనాలు రావడంతో ప్రభుత్వ పెద్దలు సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది. ఒక విధంగా దీన్ని పోలీసుల వైఫల్యంగా చూస్తున్నా దానికి మించి ఉద్యోగుల కాంక్ష ఉందని అర్ధం చేసుకోవాలని కూడా అంటున్నారు. మరి ఈ ఆందోళన తరువాత ప్రభుత్వ తీరులో మార్పు ఉంటుందా. చూడాలి.