Begin typing your search above and press return to search.
ఫైర్ బ్రాండ్ ను పక్కన కూర్చోబెట్టుకున్న కేసీఆర్
By: Tupaki Desk | 12 Aug 2016 7:14 AM GMTతనను విమర్శించే వారి విషయంలో.. తనను వెలేత్తి చూపించే వారిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత దూరంగా ఉంచుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన రాజకీయ ప్రత్యర్థుల పట్ల నిర్దయగా వ్యవహరించే కేసీఆర్.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించటం అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే..తన మంత్రి వర్గంలోని మంత్రిని కాస్త దూరంగా కూర్చోబట్టి.. తనపై నిత్యం నిప్పులు చెరిగే వైరిపక్షం ఎమ్మెల్యేను మాత్రం తన పక్కనే కూర్చోబెట్టుకున్న చిత్రమైన సన్నివేశం కృష్ణా పుష్కరాల సందర్భంగా చోటు చేసుకుంది.
కృష్ణా పుష్కరాల సందర్భంగా పుష్కర స్నానం ఆచరించేందుకు గొందిమళ్లకు వెళ్లటం తెలిసిందే. అక్కడ పుష్కర స్నానం తర్వాత ఆయన అలంపూర్ దేవాలయంలో అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రిపై తీవ్రంగా విరుచుకుపడే అలంపూర్ ఎమ్మెల్యే.. కాంగ్రెస్ పార్టీకి చెందిన సంపత్ కుమార్ ను తను కూర్చున్న సోఫాలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కూర్చోబెట్టుకోవటం అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించింది.
ఈ వ్యవహారం ఇక్కడితో ఆగలేదు. తనపై ఫైర్ అయ్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేను పక్కన కూర్చోబెట్టుకున్న కేసీఆర్ తన క్యాబినెట్ లోని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాత్రం కాస్త దూరంగా కూర్చున్నారు. మరో చిత్రమైన విషయం ఏమిటంటే.. మిగిలిన టీఆర్ఎస్ నేతలు మంత్రి ఇంద్రకరణ్ కు మరికాస్త దూరంలో ఉండటం. ఫైర్ బ్రాండ్ ను పక్కన కూర్చోబెట్టుకొని.. సొంత పార్టీ నేతల్ని కాస్త దూరంగా ఉంచటం అందరూ చర్చించుకునేలా చేసింది.