Begin typing your search above and press return to search.
మంత్రి ఈటెల డిన్నర్ ను లైట్ తీసుకున్నారు
By: Tupaki Desk | 28 March 2017 4:58 AM GMTమంత్రి డిన్నర్ ఇస్తున్నారంటే.. సహజంగానే ఆసక్తి వ్యక్తమవుతుంది. అధికారంలో ఉన్న కీలకనేత డిన్నర్ అంటే దానికి ప్రయారిటీ ఇస్తుంటారు రాజకీయ నేతలు. అయితే.. తాజాగా మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గడిచిన రెండు.. మూడు రోజలుగా ఎమ్మెల్యే సంపత్ ఇష్యూ హాట్ హాట్ గా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎస్సీ.. ఎస్టీ బిల్లు విషయంలో అసెంబ్లీలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డిపై అలిగిన సంపత్ చేసిన హడావుడి అంతాఇంతా కాదు.
మెడలో నల్ల కండువా వేసుకొని సభకు రావటమే కాదు.. సొంత పార్టీ నేతలకు దూరంగా కూర్చొని తన నిరసనను తెలియజేశారు. చివరకు జానారెడ్డి పిలిచినా ఆయన పట్టించుకోలేదు. తాను జానారెడ్డి ఇంటికెళ్లి మాట్లాడతానని చెప్పారేకానీ.. ఆయన పిలిచినప్పుడు మాత్రం వెళ్లకపోవటం గమనార్హం. ఇలా.. కినుకు వహించిన సంపత్ ను ఎట్టకేలకు కూల్ చేశారు కాంగ్రెస్ నేతలు.
తెలంగాణ అధికారపక్షం పై ఫైర్ బ్రాండ్ తరహాలో విరుచుకుపడతారన్న పేరున్న సంపత్..ధర్మాగ్రహం కాంగ్రెస్ పార్టీలో సంచలనంగా మారింది. ఆయన చేత మాట్లాడించకపోవటం తప్పేనని.. అది జానారెడ్డి చేశారంటూ సభ్యులు ఫీల్ కావటంతోపాటు..ఆయన చర్యను తప్పు పట్టారు. జానాకు..సంపత్ కు మధ్య పెరిగిన దూరాన్ని తగ్గించేందుకు జరిగిన ప్రయత్నాల కారణంగా సోమవారం ఇరువురు ఒకే కారులో వచ్చారు.
సీఎల్పీ సమావేశంలో సంపత్ ను మాట్లాడనీయకుండా అన్యాయంగా వ్యవహరించారన్న వాదన నేపథ్యంలో.. ఆయనకు మాట్లాడే అవకాశం కల్పిస్తున్నట్లుగా చెప్పటమే కాదు.. చేసి చూపించారు. తనకు మాట్లాడే అవకాశం రాని అంశాన్ని తాను ఇక వదిలేస్తునట్లుగా సంపత్ పేర్కొన్నారు. ఇరువురు నేతల మధ్య కుదిరిన సయోధ్యకు చిహ్నంగా సంపత్ డిన్నర్ ఒకటి అరేంజ్ చేశారు. వాస్తవానికి ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ కూడా డిన్నర్ కు ఇన్వైట్ చేసినా.. కాంగ్రెస్ నేతలంతా మాత్రం సంపత్ ఏర్పాటు చేసిన డిన్నర్ కు హాజరై..తమ మధ్యనున్న ఐక్యతను ప్రదర్శించే ప్రయత్నం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/