Begin typing your search above and press return to search.
విమానంలో పేలిన టాప్ మోడల్ ఫోన్
By: Tupaki Desk | 23 Sep 2016 2:08 PM GMTగెలాక్సీ నోట్ 7... స్మార్ట్ ఫోన్లలో ఆపిల్ ఐ ఫోన్ అంతటి క్రేజ్ సంపాదించింది. అయితే అదే స్థాయిలో వివాదాలు మూటగట్టుకున్న ఈ ఫోన్‌ను విమాన ప్రయాణాల్లో వెంట తీసుకువెళ్లవద్దని ఇప్పటికే ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. అయితే అలా వెంట తీసుకువెళ్లిన ఓ ప్రయాణికుడి ఫోన్ పేలిపోయింది. అది కూడా మంటలు అంటుకునే స్థాయిలో కావడం కలకలం సృష్టిస్తోంది. ఇది పొరుగు రాష్ట్రమైన చెన్నైలో జరిగింది.
సింగపూర్ నుంచి చెన్నైకి వచ్చిన ఇండిగో విమానంలో శాంసంగ్ నోట్ 2 బ్యాటరీ పేలి - పొగలు వ్యాపించాయి. ఈ క్రమంలో స్వల్పంగా మంటలు అంటుకోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయకంపితులు అయ్యారు. సంఘటనను గమనించి అప్రమత్తమైన విమాన సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. చిన్న ప్రమాదమే కావడంతో విమానంలోని 182 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. అయితే ఈ ఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సీరియస్ అయింది. వెంటనే శాంసంగ్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. దీంతోపాటు ఎయిర్‌లైన్స్‌కు సైతం హుకుం జారీచేసింది. శాంసంగ్‌కు సమావేశానికి రావాల్సిందిగా కోరింది. అదే సమయంలో సెల్ ఫోన్లను స్విచ్చాఫ్ రూపంలో వెంట తీసుకువెళ్లాల్సింది ప్రయాణికులకు అవగాహన కల్పించాలని విమానయాన సంస్థలకు కోరింది.