Begin typing your search above and press return to search.
సోషల్ ఫైట్: యాపిల్ ను ఎద్దేవా చేసిన శాంసంగ్
By: Tupaki Desk | 15 Oct 2020 5:37 PM GMTప్రపంచంలోనే నంబర్ 1, 2 మొబైల్ తయారీ కంపెనీలు యాపిల్, శాంసంగ్. ఈ రెండు ప్రస్తుతం నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడుతున్నాయి. ప్రపంచ టెక్నాలజి దిగ్గజం యాపిల్ తాజాగా పర్యావరణం, ఖర్చుల తగ్గింపు పేరుతో తాజాగా రిలీజ్ చేసిన ఐఫోన్ 12లో ఇయర్ ఫోన్స్ తోపాటు చార్జర్ ను కూడా ఇవ్వడం లేదని స్పష్టం చేసింది.
ఈ నిర్ణయంపై ఇప్పటికే ఆపిల్ యూజర్లు అసంతృప్తిని వ్యక్తం చేశారు. శాంసంగ్ కూడా 2021 నుంచి చార్జర్ లేని మొబైల్ ఫోన్లు విక్రయించాలని ప్లాన్లు చేస్తోంది.
యాపిల్ తాజాగా చార్జర్ ను ఇవ్వకుండా ఐఫోన్ 12 రిలీజ్ చేయడంపై దాని ప్రత్యర్థి శాంసంగ్ ఎద్దేవా చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది.
శాంసంగ్ ఫేస్ బుక్ లో ఒక పోస్టు పెడుతూ ‘శాంసంగ్ కు వినియోగదారులకు ఏం కావాలో అది ఇస్తుంది.. ముఖ్యంగా చార్జర్, కెమెరా, మంచి బ్యాటరీ, పనితీరు,మెమరీ, 120 హెర్జ్ స్క్రీన్ ఇస్తున్నామంటూ’ ఆపిల్ ను దెప్పిపొడిచేలా పోస్టు చేసింది. అంతేకాదు.. గెలాక్సీ ఫోన్ ల బ్లాక్ చార్జర్ ఫొటోను కూడా షేర్ చేసింది. ఈ పోస్ట్ ఆన్ లైన్ లో వైరల్ గా మారింది.
ఆపిల్ కంపెనీకి వ్యతిరేకంగా శాంసంగ్ చేసిన పోస్టుకు 70వేల లైక్స్, 10వేల కంటే ఎక్కువ ఫన్నీ కామెంట్స్ వచ్చాయి. కొందరు శాంసంగ్ కూడా అదే బాటలో నడుస్తుందంటూ కౌంటర్ ఇచ్చారు.
https://www.facebook.com/SamsungCaribbean/posts/4610541622352343

https://www.facebook.com/