Begin typing your search above and press return to search.
నోట్ 7 నష్టాన్ని ఎయిర్ పోర్ట్ లలో భర్తీ ..?
By: Tupaki Desk | 19 Oct 2016 5:01 AM GMTవినేందుకు ఆసక్తిగా అనిపించినా అది నిజం. టెక్నాలజీ దిగ్గజ కంపెనీ అయిన శాంసంగ్ కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇవ్వటమే కాదు. వేలాది కోట్ల రూపాయిల నష్టాన్నిమిగిల్చిన గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ ఫోన్ ఇష్యూలో తాజాగా ఆ కంపెనీ ఒక ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది నోట్ 7 ఫోన్లను అమ్మిన శాంసంగ్ వాటిని తిరిగి తీసుకునే కార్యక్రమం చేపట్టినా.. అనుకున్నంతగా అది వర్క్ వుట్ కాలేదు. అదే సమయంలో.. ఎంత చెబుతున్నా.. పలువురు ఈ ఫోన్ వాడటం.. వాటిల్లో ఒకటో.. రెండో పేలిపోవటంతో శాంసంగ్ ఇమేజ్ ను మరింత డ్యామేజ్ చేస్తున్నాయి.
నోట్ 7ను తమ విమానాల్లో అనుమతించమని పలు విమానయాన కంపెనీలు ఇప్పటికే ప్రకటించిన ముచ్చట తెలిసిందే. ఈ నేపథ్యంలో శాంసంగ్ తన కస్టమర్లకు ఇబ్బంది కలిగించకుండా.. వారి మదిని దోచుకునే పని ఒకటి మొదలెట్టింది. అమెరికాలోని పలు విమానాశ్రయాల్లో శాంసంగ్ తన అవుట్ లెట్లను ఏర్పాటుచేసింది. ఈ అవుట్ లెట్లలో వినియోగదారులు తమ నోట్ 7ను ఇచ్చేసి.. దాని బదులుగా వేరే మోడల్ స్మార్ట్ ఫోన్ ను ఉచితంగా పొందే ఏర్పాటు చేసింది. నోట్ 7 మీద వచ్చిన ఫిర్యాదులతో దాన్ని వినియోగించొద్దని.. స్విచ్ఛాప్ చేసేసి.. బ్యాటరీని వేరు చేసి ఉంచాలని ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయినప్పటికీ.. కొందరు వినియోగదారులు ఫోన్ ను వాడుతూ.. పేలిపోతున్న ఘటనలు బయటకు వచ్చిన వేళ.. వీలైనన్ని ఫోన్లను వెనక్కి తీసుకునేందుకు ఎయిర్ ఫోర్ట్ ప్లాన్ ను రచించింది. అమెరికాతో పాటు.. ఆస్ట్రేలియాలోని పలు ఎయిర్ పోర్ట్ లలో శాంసంగ్ తమ అవుట్ లెట్లను ఓపెన్ చేసి నోట్ 7 ఫోన్ ను వెనక్కి తీసుకొని.. మరో ఫోన్ ఇవ్వటం.. ఎవరైనా వినియోగదారుడు తనకు ఫోన్ వద్దని.. డబ్బులు వెనక్కి ఇవ్వాలంటే ఎలాంటి వాదనకు అవకాశం ఇవ్వకుండా మనీ రిఫండ్ ఇవ్వాలని డిసైడ్ చేయటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/