Begin typing your search above and press return to search.
శాంసంగ్ బాంబ్.. మళ్లీ పేలింది!
By: Tupaki Desk | 7 Oct 2017 12:53 PM GMTప్రస్తుతం సెల్ ఫోన్ లు సెల్ బాంబుల మాదిరిగా మారిపోతున్నాయి. బ్యాటరీ ఛార్జింగులు పెడుతున్నా.. ఫోన్ లో మాట్లాడుతున్నా.. ఎక్కడ అవి పేలిపోతాయో చెప్పడం కష్టంగా మారింది. మొన్నటికి మొన్న ఐఫోన్లు.. ఐబాంబులుగా మారిపోయాయని ప్రజలు గగ్గొలు పెట్టారు. ఈ క్రమంలోనే ఐఫోన్ కంపెనీ బ్యాటరీల విషయంలో పునరాలోచనలో పడింది. ఇప్పుడు తాజాగా.. శాంసంగ్ కంపెనీకి చెందిన ఓ స్మార్ట్ ఫోన్ మళ్లీ పేలింది. అయితే ఈ సారి ఛార్జింగ్ పెడుతుండగానో, ఫోన్ మాట్లాడుతుండగానో కాదు జేబులో పెట్టుకోగానే అది పేలిపోయింది.
ఈ ఫోన్ పేలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ సారి పేలుడు ఘటను చోటుచేసుకుంటున్న గెలాక్సీ నోట్7 కాదు - శాంసంగ్ గ్రాండ్ డ్యూస్ స్మార్ట్ ఫోన్. దీంతో తీవ్ర కలకలం రేగింది. వాస్తవానికి శాంసంగ్ ట్రస్టెడ్ కంపెనీ. అయితే, ఒక్కసారిగా ఇలా జరగడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. విషయంలోకి వెళ్తే.. 47 సంవత్సరాల హోటల్ సూపర్ వైజర్ యులియాన్టో ఇండోనేషియాలోని ఓ హోటల్ లాబీలో వేచి చూస్తున్నాడు. ఒక్కసారిగా ఆయన జేబులో నుంచి హీటింగ్ సెన్సేషన్ రావడం మొదలైంది. అనంతరం ఒక్కసారిగా జేబులోనే ఫోన్ పేలిపోయింది. వెంటనే ఆ మంటలు చొక్కాకు కూడా అంటుకున్నాయి. అనంతరం ఆయన వేచిచూస్తున్న రూమంతా పొగ కమ్ముకుంది.
ఈ ఘటనలో యులియాన్టో ముఖానికి గాయాలయ్యాయి. షాక్ నుంచి తేరుకుని వెంటనే చొక్కా విప్పేసినట్టు యులియాన్టో చెప్పాడు. ఈ ఘటన సెప్టెంబర్ 30న చోటుచేసుకుంది. ఇదంతా యులియాన్టో వేచిచూస్తున్న హోటల్ లాబీ సీసీటీవీలో రికార్డైంది. శాంసంగ్ ఈ ఫోన్ ను 2013లో లాంచ్ చేసింది. ఫోన్ లో ఒకేసారి వై-ఫై - బ్లూటూత్ - జీపీఎస్ ఆన్ చేసి వినియోగించటం వల్లే ఇలా జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఘటనపై ఇండోనేషియా పోలీసులు - టెలికాం నిపుణులు విచారణ చేపట్టారు. మొత్తానికి ఈ ఘటనతో పెద్ద విపత్తు తప్పిందని పోలీసులు చెప్పారు.