Begin typing your search above and press return to search.

సింధుపై ఆ ద‌ర్శ‌కుడి అనుచిత వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   23 Aug 2016 2:52 PM GMT
సింధుపై ఆ ద‌ర్శ‌కుడి అనుచిత వ్యాఖ్య‌లు
X
రియో ఒలింపిక్స్ లో ర‌జ‌తం గెలిచి దేశంలో సంతోషం నింపిన పి.వి.సింధు మీద కురుస్తున్న న‌జ‌రానాల వర్షం.. ఆమెకు జ‌రుగుతున్న స‌న్మానాలు.. స‌త్కారాలు.. ఆమెకు ల‌భించిన స్వాగ‌తం.. వీటిపై జ‌నాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. ఆమెకు ఆ గౌర‌వం స‌ముచిత‌మే అంటారు కొంద‌రు. ఐతే మ‌రీ ఇంత‌గా స్పందించాలా.. సంబ‌రాలు చేసుకోవాలా.. ఆ స్థాయిలో కానుకల వ‌ర్షం కురిపించాలా అంటుంది ఇంకో వ‌ర్గం. ఐతే నిర్మాణాత్మ‌క చ‌ర్చ అవ‌స‌ర‌మే కానీ.. ఐతే మ‌ల‌యాళ దర్శ‌కుడు సనల్ కుమార్ శశిధరన్ మాత్రం ఈ విష‌యంలో తీవ్రంగా స్పందించాడు. సింధుకు ల‌భిస్తున్న ఆద‌ర‌ణ‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశాడు.

‘‘సింధు విజయం నేప‌థ్యంలో ప్రతి ఒక్కరూ సంబరాలు చేసుకుంటున్నారు. దీన్ని అంతగా సెలెబ్రేట్ చేసుకోవడానికి ఏముంది?'' అని ఫేస్ బుక్ పోస్టులో ప్ర‌శ్నించాడు శ‌శిధ‌ర‌న్‌. దీంతో పాటు సింధు విజయంపై మరో అభ్యంతరకరమైన కామెంట్ చేశాడు. ‘సింధు ప‌త‌కం మీద నేను ఉమ్మేస్తే ఏం జ‌రుగుతుంది' అని అత‌ను వ్యాఖ్యానించాడు. ముందు రెండు వ్యాఖ్య‌ల విష‌యంలో ఎవ‌రికీ అభ్యంత‌రాల్లేవు కానీ.. ఈ ఉమ్మేస్తే అనే కామెంటే నెటిజ‌న్ల‌కు చిరాకు తెప్పించింది. కేర‌ళ‌కు చెందిన క్రీడాభిమానులు సైతం శ‌శిధ‌ర‌న్ మీద విరుచుకుప‌డ్డారు. ఐతే త‌న వ్యాఖ్య‌ల‌పై తీవ్ర విమర్శలు రావడంతో శశిధరన్ వివరణ ఇచ్చాడు. తన వ్యాఖ్యలను సరిగా అర్థం చేసుకోలేదంటూ అంద‌రూ పాడే రొటీన్ పాటే పాడాడు.