Begin typing your search above and press return to search.
'సేవ్ మన్సాస్' ఉద్యమం కాదు.. 'సేవ్ అశోక్' క్యాంపెయిన్!
By: Tupaki Desk | 9 Nov 2020 5:10 PM GMTతెలుగుదేశం పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై సింహాచలం ట్రస్టు బోర్డు, మన్సాస్ ట్రస్టు బోర్డు చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు మండిపడ్డారు. ఆయన అక్రమాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి కాబట్టే ఉద్యమాల పేరిట రాజకీయాలు చేస్తున్నారని , 150 ఏళ్ల చారిత్రక మోతీమహల్‌ను కూల్చినపుడు ఉద్యమం ఎందుకు చేయలేదని అశోక్ గజపతిరాజును ట్విటర్ వేదికగా సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు..8 వేల ఎకరాల మన్సాస్ భూములను ఎకరా 5 వందల రూపాయలకు మీ అనునాయులకు లీజుకి కట్టబెట్టినపుడు నిజానికి సేవ్ మన్సాస్ ఉద్యమాన్ని చేయాల్సింది కదా . మార్కెట్ ధరకు మీరిచ్చిన లీజులకు ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్నించారు.
కనీసం లాయర్ ను పెట్టుకోవడం కూడా చేతకాక రూ. 13 కోట్ల నష్టాన్ని కలిగించే విధంగా, మన్సాస్ భూములు ఎక్స్ పార్టీ డిక్రీ ద్వారా అన్యాక్రాంతమైనపుడు మీరు ఉద్యమం చేయాల్సింది. 2016-2020 మధ్య కాలంలో మీరు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో మన్సాస్ విద్యాసంస్థలకు 6 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని , ఆ సమయంలో ఈ ఉద్యమం మొదలు పెట్టాల్సింది. మీరు చైర్మన్ గా ఉన్నపుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి నుంచి అవసరమైన అనుమతులు తెచ్చుకోకపోవడంతో 170 మందికి ఇచ్చిన డిగ్రీలు చెల్లుబాటుకాకుండా పోయాయి. అప్పుడు సేవ్ మన్సాస్ ఉద్యమం చేయాల్సింది. సరైన ఆడిటింగ్ నిర్వహించక, మాన్యువల్ గా తప్పుడుతడకలుగా ఆడిటింగ్ చేయించినపుడు ఉద్యమం ప్రారంభిస్తే నిజానిజాలు బయటపడేవి.
అశోక్ గారూ.. మీరు ఎంఆర్ కాలేజీపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిలోకి తెచ్చారు. మీరు చైర్మన్‌గా ఉన్నపుడే ఇది ఒక ప్రైవేట్ కాలేజీ, ప్రభుత్వం ఇచ్చే సహకారాన్ని మీరే తీసేశారు. ఆ విధానమే ఇప్పుడు కొనసాగుతోంది అంటూ అశోక్ గజపతిరాజు తీరును ఎండగట్టారు. వాస్తవానికి తానే సేవ్ మన్సాస్ ఉద్యమం నడుపుతున్నానని, ట్రస్టు పూర్వవైభవాన్ని పునురుద్ధరిస్తానన్న సంచయిత.. మీరు మీ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోండి అంటూ అశోక్ గజపతిరాజుకు హితవు పలికారు.