Begin typing your search above and press return to search.
సంచయిత మళ్లీ ఫైర్ అయ్యింది..
By: Tupaki Desk | 30 Oct 2020 3:30 PM GMTపైడితల్లి సిరిమానోత్సవం విజయనగరం పూసపాటి రాజ వంశంలో చిచ్చు పెట్టింది. మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు వ్యవహారశైలితో నిప్పు అంటుకుంది. సిరిమానోత్సవం తిలకించేందుకు వచ్చిన ఆనందగజపతిరాజు రెండో భార్య సుధా, ఆయన కూతురు ఉర్మిళను అక్కడి నుంచి వెళ్లగొట్టాలని సంచయిత ఆదేశాలివ్వడం.. పోలీసులను పురమాయించడంతో వివాదం రాజుకుంది.
ఉర్మిళ, సుధ మీడియాకు ఎక్కి తాము వారసులమేనని.. సంచయిత తమను అవమానించిందని ఆరోపించడంతో ఈ వివాదం రాజుకుంది. సంచయితపై వారు తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ క్రమంలోనే ఈ వివాదంపై మాన్సాస్ కార్యాలయం లేఖ విడుదల చేసింది. ట్రస్ట్ చైర్ పర్సన్ అయిన సంచయితకు ముందు వరుసలో సీటు కేటాయించడం ఆనవాయితీగా వస్తోందని.. కొంతమంది ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నేరుగా వచ్చి ముందు వరుసలో కూర్చున్నారని పేర్కొంది. దీనిపై తమకు సీట్లు కేటాయించలేదని మీడియాకు చెప్పడం బాధాకరమని మాన్సాస్ కార్యాలయం లేఖలో విచారం వ్యక్తం చేసింది.
సిరిమానోత్సవం ప్రజల పండుగ అని.. కొంతమంది రాజరికం కోరుకోవడం దురదృష్టకరమని మాన్సాస్ ట్రస్ట్ ఆరోపించింది.
ఇక ఉర్మిళ తల్లి, ఉర్మిళ ప్రవర్తించిన తీరు అహంకారపూరితం అని సంచయిత ఆగ్రహం వ్యక్తం చేసింది.